కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డబ్బులు ఏరులై పారితే కడప ఉప ఎన్నికలు రద్దు చేయాలి: అగ్నివేష్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Swami Agnivesh
హైదరాబాద్: కడప ఉప ఎన్నికలలో భారీగా అక్రమాలు, మద్యం, డబ్బు పంపకాలు జరిగినట్లు ఆరోపణలు వచ్చినందున ఆ ఉప ఎన్నికలు రద్దు చేయాలని కోరతానని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరతానని స్వామి అగ్నివేష్ మంగళవారం చెప్పారు. ఉప ఎన్నికల్లో సుమారు 350 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఎన్నికల సంఘం దీనిపై దృష్టి సారించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కడపలో ధనం ఏరులై పారిందని అన్నారు. ఈ విషయంపై ఎన్నికల సంఘం విచారణ జరపాలని అన్నారు. విచారణలో ధనం ఏరులై పారిన విషయం నిజమని తేలితే ఎన్నికలను రద్దు చేయాలని అన్నారు.

ప్రభుత్వాలు గ్రీన్ హంట్ పేరుతో గిరిజనుల హక్కులు కాలరాస్తున్నాయని ఆయన ఆరోపించారు. ప్రభుత్వాలు అడవులలో ఉండే గిరిజనులను హక్కులను కాలరాస్తూ వారిని బలవంతంగా అక్కడి నుండి తరలిస్తూ ఖనిజ సంపదని దోచుకుంటుందని ఆరోపించారు. ఇలాంటి చర్యలు సమర్థనీయం కాదన్నారు.

English summary
Swamy Agnivesh demanded that cancel Kadapa bypoll. He said he will urged central election committee to cancel.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X