వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్ జగన్ విజయాన్ని కోరుతున్న తెలంగాణ నాయకులు

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: కడప ఉప ఎన్నికల్లో తెలంగాణ రాజకీయ నేతలు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత వైయస్ జగన్ విజయాన్ని ఆశిస్తున్నారు. పార్లమెంటులో ప్లకార్డులు ప్రదర్శించి సమైక్యవాదాన్ని వినిపించిన వైయస్ జగన్ పట్ల వ్యతిరేకత క్రమంగా తగ్గింది. కాంగ్రెసు నుంచి బయటకు వచ్చి సొంత పార్టీని పెట్టుకున్న తర్వాత తెలంగాణ రాజకీయ నాయకులు జగన్ పట్ల కాస్తా సానుకూలతను ప్రదర్శిస్తున్నట్లు అర్థమవుతోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు మాత్రమే అడ్డు పడుతున్నాయని, ఈ రెండు పార్టీలను ఇటు తెలంగాణలోనూ అటు సీమాంధ్రలోనూ దెబ్బ తీస్తే తెలంగాణకు పరిస్థితి అనుకూలంగా మారుతుందని భావిస్తున్నారు.

తెలంగాణలో ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పట్టు సాధించింది. తెలుగుదేశం పార్టీ ఇప్పటికే తెలంగాణలో పూర్తి బలహీనపడిందని భావిస్తున్నారు. తమ పార్టీ పట్టును నిలబెట్టుకోవడానికి కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు కష్టపడుతున్నా అంత ఫలితం ఇవ్వడం లేదని చెబుతున్నారు. పైగా, కడపలో వైయస్ జగన్ భారీ మెజారిటీతో విజయం సాధిస్తే తెలంగాణ నాయకులు చాలా మంది ఆయన వైపు మళ్లే అవకాశాలున్నాయని కూడా అంటున్నారు. దానివల్ల కాంగ్రెసు పార్టీ తెలంగాణలో మరింత బలహీనపడుతుందని, సీమాంధ్రలో వైయస్ జగన్ పట్టు పెరిగితే అక్కడా కష్టాలు ఎదురవుతాయని, ఈ పరిస్థితి కాంగ్రెసు అధిష్టానం తెలంగాణ దిశగా ఆలోచన చేయడానికి పనికి వస్తుందని విశ్లేషిస్తున్నారు.

వైయస్ జగన్‌ వర్గానికి చెందిన నాయకులు ఇప్పుడు తెలంగాణలో స్వేచ్ఛగా పర్యటిస్తున్నారు. వైయస్ జగన్ ఫీజు రీయంబర్స్‌మెంట్ ఆందోళనకు కూడా తెలంగాణ నాయకుల నుంచి వ్యతిరేకత ఎదురు కాలేదు. దీన్నిబట్టి వైయస్ జగన్ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే తమకు మరింత లాభం జరుగుతుందని తెలంగాణ నాయకులు భావిస్తున్నారు.

English summary
Telangana political leaders wanting the victory of YSR Congress leader YS Jagan Kadapa lojsabha seat with thumping majority.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X