వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ ఆధిక్యతపై లగడపాటి సర్వేలు తప్పు: ఎమ్మెల్యే వీరశివారెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Lagadapati Rajagopal
హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆధిక్యతపై విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ చేసిన సర్వేలు తప్పని కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు వీరశివారెడ్డి మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి, వైయస్ వివేకానందరెడ్డి, వీరశివారెడ్డి సమావేశమై ఉప ఎన్నికలపై చర్చించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.

జగన్ ఆధిక్యతపై పత్రికలలో వచ్చిన కథనాలు కూడా తప్పు అని అన్నారు. జగన్ ఆధిక్యతను అంతకంతకు పెంచి చూపిస్తున్నారని ఆయన అన్నారు. జగన్‌కు రెండులక్షల ఆధిక్యత వచ్చే పరిస్థితే లేదన్నారు. ఫలితాలు మే 13న వస్తాయని అప్పుడు లగడపాటి సర్వే, పత్రికల కథనాలు తప్పు అని తేలుతుందని చెప్పారు.

ఉప ఎన్నికలలో జగన్ భారీగా అక్రమాలకు పాల్పడ్డారని చెప్పారు. జగన్‌కు స్థానిక ఎస్పీ తరుణ్ జోషి సహకరించారని ఆరోపించారు. తాను ఎమ్మెల్యేనని తనకు స్వేచ్ఛగా తిరిగే హక్కు ఉన్నప్పటికీ ఎస్పీ తనను గృహ నిర్బంధం చేశారని అన్నారు. ఉప ఎన్నికల రోజు తనను ఎస్పీ తీవ్రంగా వేధింపులకు గురి చేశారని అన్నారు. ఎస్పీకి సభా హక్కుల నోటీసు ఇస్తానని చెప్పారు.

English summary
MLA Veerashiva Reddy was opposed Vijayawada MP Lagadapati survey today. He said Jagan will not get two lack majority. He accused SP's attitude at bypoll.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X