వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిన్న భార్య అమల్ అహ్మద్ అబ్దుల్ ఫతాను లాడెన్ ఎలా పొందాడు?

By Pratap
|
Google Oneindia TeluguNews

Amal Ahmed Abdul Fatah
వాషింగ్టన్: అమెరికా నేవీ సీల్స్ దాడి చేసినప్పుడు ఆల్ ఖైదా వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్‌కు అడ్డుగా నిలిచి గాయాల పాలైన లాడెన్ చిన్న భార్య వార్తల్లో వ్యక్తిగా మారింది. లాడెన్ ఐదో భార్య అమల్ అహ్మద్ అబ్దుల్ ఫతా యెమెన్ దేశానికి చెందింది. ఆమె వివాహాన్ని లాడెన్‌తో జరిపించే విషయంలో యెమెన్ మత గురువు ప్రధాన పాత్ర పోషించాడు. ఉన్నతమైన నైతిక విలువలు గల ఫతాను లాడెన్ తన ఐదో భార్యగా ఎంచుకున్నట్లు మీడియా వార్తలు వచ్చాయి.

టీనేజీలో ఉన్నప్పుడే ఫతాతో లాడెన్ వివాహం జరిపించడానికి తాను సహాయ పడ్డానని షేక్ రషాద్ ఎబిసి న్యూస్‌తో చెప్పాడు. ప్రస్తుతం ఫతా వయస్సు 29 ఏళ్లు కాగా, లాడెన్ వయస్సు 54 ఏళ్లు. లాడెన్ పట్ల ఫతా వివాహ సమయంలో ఏ విధమైన ఫిర్యాదు చేయలేదని రషాద్ చెప్పాడు.

ఫతాతో పాటు మరో ఇద్దరు భార్యలు లాడెన్ ఏం కావాలన్నా వ్యతిరేకించకుండా చేసేవారని బేర్‌ఫుట్ ఇన్ బగ్దాద్ పుస్తక రచయిత, ఇస్లాంలో మహిళ పాత్రపై నిపుణుడు మనాల్ ఒమర్ చెప్పారు. లాడెన్‌పై దాడి జరిగినప్పుడు ఆ ముగ్గురు కూడా ఆవరణలోనే ఉన్నారు. పురుష నాయకుడు లేదా భరత్ కోరికలను తీర్చడమే ముస్లిం మహిళల విధిగా ఉంటుందని ఒమర్ అన్నారు.

English summary
A Yemeni cleric who helped arrange Osama bin Laden's fifth marriage has said the Al Qaeda leader wanted his youngest wife to be of high moral value, according to a media report on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X