వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉప ఎన్నికలు: వైయస్ జగన్, వైయస్ విజయమ్మ మెజారిటీపైనే ఆసక్తి

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan-YS Vijayamma
హైదరాబాద్: కడప లోకసభ, పులివెందుల శాసనసభ స్థానాల్లో దాదాపుగా విజయం ఖరారైంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి చెందిన వైయస్ జగన్ కడప లోకసభ స్థానంలో, వైయస్ విజయమ్మ పులివెందుల శానససభా స్థానంలో గెలుస్తారని ఇప్పటికే ఒక కచ్చితమైన అంచనాకు అన్ని వర్గాలూ వచ్చాయి. కాంగ్రెసు పార్టీ నాయకులే స్వయంగా ఆ విషయాన్ని అంగీకరిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం ఉప ఎన్నికల ఫలితాలపై నోరు కూడా విప్పడం లేదు. తమ ఓటమి ఖరారైందని తెలిసే తెలుగుదేశం నాయకులు మాట్లాడడం లేదని చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ మూడో స్థానానికే పరిమితం కావచ్చుననే అంచనాలు కూడా సాగుతున్నాయి.

కాగా, వైయస్ జగన్ భారీ మెజారిటీతో గెలుస్తారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులే కాకుండా కాంగ్రెసు విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ కూడా అంటున్నారు. వైయస్ జగన్ నాలుగు లక్షల మెజారిటీతో గెలుస్తారని లగడపాటి రాజగోపాల్ జోస్యం చెప్పారు. రేపు ఉదయం రెండు స్థానాలకు కూడా ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. రేపు శుక్రవారం మధ్యాహ్నానికల్లా ఫలితాలు వెల్లడవుతాయి. ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

వైయస్ జగన్ మెజారిటీ తగ్గించడానికి కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ నాయకులు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదని అంటున్నారు. కడప లోకసభ స్థానంలోని బెల్లంమండిలో గురువారం రీపోలింగ్ జరిగింది. ఈ రీపోలింగ్ ప్రశాంతంగా జరిగింది.

English summary
Counting of votes polling held for Kadapa loksabha and Pulivendula bypolls will be tajenup tommorrow.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X