వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తప్పిన ముప్పు: తుపాకితో రాహల్ గాంధీ చెంత ఆగంతకుడు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Rahul Gandhi
లక్నో: ఏఐసిసి ప్రధాన కార్యదర్శి, యువనేత రాహుల్ గాంధీకి బుధవారం తృటిలో ప్రమాదం తప్పినట్లుగా తెలుస్తోంది. గ్రేటర్ నోయిడాలో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం భూసేకరణను వ్యతిరేకిస్తూ రైతులు నిర్వహిస్తున్న ఆందోళనలో రాహుల్ గాంధీ వచ్చి పాల్గొన్న విషయం తెలిసిందే. జెడ్ ప్లస్ కేటగిరి కలిగిన రాహుల్ గాంధీ ఓ కాంగ్రెసు కార్యకర్త మోటారు బైక్‌పై రైతుల ఆందోళన కార్యకర్త వద్దకు వెళ్లారు. స్థానికులతో కలిసి మాట్లాడటానికి, వారితో కలిసి కూర్చోవడానికి ఆయన తన భద్రతను దాటుకొని రావాల్సి వచ్చింది. అలాంటి సమయంలో ఓ అగంతకుడు ఓ నాటు తుపాకితో రాహుల్ గాంధీకి సమీపంలో తచ్చాడినట్లుగా తెలుస్తోంది.

అయితే పోలీసులు అప్రమత్తంగా ఉండటంతో ప్రమాదం తప్పినట్లుగా భావిస్తున్నారు. నాటు తుపాకితో తచ్చాడుతున్న ఆ అగంతకుడిని ఉత్తర ప్రదేశ్ పోలీసులు వెంటనే గమనించి అదుపులోకి తీసుకున్నారు. అగంతకుడి నుండి తుపాకిని స్వాధీనం చేసుకున్నారు. సదరు వ్యక్తిని ఎస్‌పిజికి అప్పగించారు. అగంతకుడిని ఎస్‌పిజిని విచారిస్తున్నాట్లుగా తెలుస్తోంది.

English summary
A youth armed with a country made pistol seen standing close to Congress leader Rahul Gandhi was detained on Wednesday night at Kasna police station in Uttar Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X