వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గ్రేటర్ నోయిడాలో రాహుల్ గాంధీ అరెస్టు, అర్థరాత్రి హైడ్రామా

By Pratap
|
Google Oneindia TeluguNews

Rahul Gandhi
గ్రేటర్ నోయిడా: భూ స్వాధీనానికి వ్యతిరేకంగా పోరాడుతున్న రైతులను పరామర్శించడానికి వచ్చిన కాంగ్రెసు ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీని ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్టు చేసి, తర్వాత విడుదల చేశారు. దీంతో బుధవారం ఆర్థరాత్రి గ్రేటర్ నోయిడాలో హై డ్రామా చోటు చేసుకుంది. దాదాపు మూడు గంటల పాటు హై డ్రామా చోటు చేసుకుంది. రాహుల్ గాంధీని అరెస్టు చేసి, పోలీసు స్టేషన్ తీసుకుని వెళ్లి ఆ తర్వాత ఢిల్లీకి పంపించి వేశారు.

రాహుల్ గాంధీ బుధవారం దాదాపు 19 గంటల పాటు భట్టా పరసోల్ గ్రామంలోని రైతులతో గడిపారు. గురువారం తెల్లవారు జామున 2 గంటల 15 నిమిషాల ప్రాంతంలో ఉత్తరప్రదేశ్ పోలీసులు రాహుల్ గాంధీని బెయిల్‌పై విడుదల చేశారు. రాహుల్‌తో పాటు ఎఐసిసి ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సిగ్, ఉత్తరప్రదేశ్ కాంగర్ెసు చీఫ్ రీటా బహుగుణ జోషీ, కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యులు రాజ్ బబ్బర్, పర్వేజ్ హష్మీలను కూడా అరెస్టు చేశారు.

రాజకీయ నాయకులు గ్రామంలోకి ప్రవేశించకుండా మాయావతి ప్రభుత్వం నిషేధాజ్ఞలు విధించింది. ఈ నిషేధాజ్ఞలను ఉల్లంఘిస్తూ బుధవారం రాహుల్ గాంధీ బైక్‌పై భట్ట పరసోల్ గ్రామానికి చేరుకున్నారు.

English summary
Rahul Gandhi was arrested and later released by the UP police capping a day of high drama after he slipped in unnoticed in pre-dawn hours on Wednesday to support the farmers agitating against the state's land acquisition process for a expressway project.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X