వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డ ఉత్తరప్రదేశ్ సిఎం మాయావతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Mayawati
లక్నో: భూ సేకరణపై రైతులకు అండగా నిలిచిన కాంగ్రెసు ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతి విరుచుకుపడ్డారు. కేంద్రంలో రాహుల్ మాట ఎవరూ వినేట్లు లేరని ఆమె వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలు అబద్ధాలు మాట్లాడుతున్నాయని, శాంతిభద్రతల సమస్యను సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆమె గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో విమర్శించారు. రైతు సమస్యలపై రాహుల్ గాంధీ కేంద్రంలో కొట్లాడాలని, అక్కడ ఎవరూ రాహుల్ మాట వినిపించుకోవడం లేదనిపిస్తోందని ఆమె అన్నారు.

ఎక్స్‌ప్రెస్ వే కోసం సేకరించిన భూములకు గాను రైతులకు తగిన నష్టపరిహారం చెల్లించినట్లు ఆమె తెలిపారు. గ్రేటర్ నోయిడాలోని భూ సేకరణను వ్యతిరేకిస్తూ రైతులు చేపట్టిన ఆందోళనలో నలుగురు మరణించారు. దీనిపై వివరణ ఇవ్వడానికి మాయావతి గురువారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తమ భూములను సేకరించి మాయావతి ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కట్టబెట్టారని రైతులు ఆరోపిస్తున్నారు. తమ నుంచి భూములను తక్కువ ధరకు బలవంతంగా లాక్కున్నారని వారంటున్నారు.

English summary
Political parties are lying and are trying to create law and order problems." With that remark, Mayawati delivered her verdict on Rahul Gandhi's much-discussed trip to visit farmers in her state yesterday - a trip that saw him jailed briefly. "Rahul should fight for farmers' rights at the centre," she said, "nobody there seems to listen to him."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X