వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మీతోనే చస్తా: ఒసామా బిన్ లాడెన్‌తో చిన్న భార్య అమల్ అహ్మద్ ఫతా

By Pratap
|
Google Oneindia TeluguNews

Osama Bin Laden
యెమెన్: తనకు దూరంగా అఫ్ఘనిస్తాన్ నుంచి వెళ్లిపోవాలని ఆల్ ఖైదా వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్ తాను బతికి ఉన్నప్పుడు భార్యలకు చెప్పాడు. అయితే, మీతోనే ఉంటానని, మీతోనే మరణిస్తానని యెమెన్‌కు చెందిన చిన్న ఐదో భార్య అమల్ అహ్మద్ అబ్దుల్ ఫతా ఆల్ సాదా చెప్పిందట. అమెరికాపై 2001 సెప్టెంబర్ 11వ తేదీన దాడి చేయడానికి ముందు లాడెన్ అఫ్ఘనిస్తాన్ నుంచి తనకు దూరంగా వెళ్లిపోవాలని భార్యలకు చెప్పాడని వార్తలు వస్తున్నాయి.

అమెరికా నేవీ సీల్స్ దాడిలో ఆల్ ఫతా సదా కాళ్ల నుంచి బుల్లెట్లు దూసుకెళ్లాయి. ప్రస్తుతం ఆమె తన కూతురు, మరో ఇద్దరు లాడెన్ భార్యలతో పాకిస్తాన్‌లో ఉంది. వివాహం తర్వాత ఫతాను తాము ఒకేసారి చూశామని ఆమె కుటుంబ సభ్యులు అంటున్నారు. ఫతా సాదా సీదా మహిళ అని అయితే దృఢ చిత్తం, ధైర్యం గల స్త్రీ అని వారంటున్నారు. హైస్కూల్ చదువు మధ్యలోనే ఆపేసింది. తాను చరిత్రలో నిలిచిపోదలుచుకున్నట్లు ఆమె చెప్పేదట.

English summary
Osama Bin Laden once gave his wives the option of leaving Afghanistan, but his young Yemeni bride was determined to stay and be "martyred" alongside him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X