హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్‌తో కాంగ్రెసు పోటాపోటీ: కడప ఉప ఎన్నికపై దగ్గుబాటి పురంధేశ్వరి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Purandeswari
హైదరాబాద్: కడప, పులివెందుల ఉప ఎన్నికలలో కాంగ్రెసు పార్టీకి సానుకూలంగానే వస్తాయని కేంద్ర సహాయ మంత్రి పురందేశ్వరి, శాసనమండలి సభ్యుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి గురువారం వేరువేరుగా విలేకరులతో మాట్లాడుతూ అభిప్రాయ పడ్డారు. మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి దీక్షలు చేయడం పరిపాటి పొంగులేటి సుధాకర్ రెడ్డి విమర్శించారు. ఆయనకు దీక్షలు ఓ అలవాటు అని అన్నారు. ఉప ఎన్నికల తర్వాత ఏదో జరిగిపోతుందని జగన్ వర్గం కలలు కంటోందని, అయితే జరిగేది ఏమీ ఉండదన్నారు. ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం అరెస్టు చేయడం విచారకరమన్నారు. రాహుల్ అరెస్టు కక్ష్య సాధింపు చర్యే అన్నారు.

కడప, పులివెందులలో కాంగ్రెసుకు విజయావకాశాలు ఉన్నాయని ఓ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రమంత్రి పురందేశ్వరి అభిప్రాయపడ్డారు. ఫలితాలు పోటాపోటీగా ఉండే అవకాశం ఉందన్నారు. అయినా మరో 24 గంటల్లో ఫలితాలు వెల్లడి కానున్నందున వేచి చూడాలని అన్నారు.

English summary
MLC Ponguleti Sudhakar Reddy blamed Ex MP YS Jaganmohan Reddy for his fasts. He accused that Jagan camp is in dreams.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X