వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పశ్చిమ బెంగాల్‌లో చరిత్ర సృష్టించిన దీదీ: 18న ప్రమాణం స్వీకారం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Mamatha Benarjee
న్యూఢిల్లీ: ముప్పై అయిదేళ్ల కమ్యూనిస్టుల పాలనకు పశ్చిమ బెంగాల్ మంగళం పాడి మమతా బెనర్జీ ఆధ్వర్యంలోని తృణమూల్ కాంగ్రెస్‌కు పట్టం గట్టే దిశగా లెక్కింపు సరళి కొనసాగుతోంది. బెంగాల్‌లో టిఎంసి, కాంగ్రెసు కూటమి 201 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. గెలుపు దాదాపు స్పష్టం కావడంతో మమతా బెనర్జీ ఈ నెల 18న ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కనిపిస్తోంది. కాగా మాజీ స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ పశ్చిమ బెంగాల్ ప్రజలు కమ్యూనిస్టులను తిరస్కరించారని అన్నారు. ముప్పై అయిదేళ్ల కమ్యూనిస్టుల కోటను కూల్చిన ఘనత మాత్రం మమతకు దక్కింది.

ఐదు రాష్ట్రాల ఎన్నికలలో భాగంగా ఈ రోజు ఓట్ల లెక్కింపు జరుతున్న విషయం తెలిసిందే. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలో అధికారంలో ఉన్న పార్టీలో వెనుకంజలో ఉన్నాయి. అసోం మాత్రం కాంగ్రెసు ముందంజలో ఉంది. పుదుచ్చేరిలో అధికార పార్టీ మళ్లీ అధికారం నిలబెట్టుకునే అవకాశం కనిపిస్తోంది. 34 తర్వాత వామపక్ష కూటమి పశ్చిమ బెంగాల్‌లో అధికారాన్ని కోల్పోయింది. దేశవ్యాప్తంగా వామపక్షాలకు ఇది పెద్ద దెబ్బ.

English summary
Mamatha Benerjee may swear on 18 of May. She may get 200 above seats.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X