హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాంగ్రెసు పార్టీని ఆంధ్రలో మొయిలీయే భ్రష్టు పట్టించాడు: పాల్వాయి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Palwai Govardhan Reddy
హైదరాబాద్: వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం కాంగ్రెసు శాసనసభ్యులపై ఇప్పటికైనా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కాంగ్రెసు సీనియర్ నాయకుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. కడప, పులివెందుల ఉప ఎన్నికల వైఫల్యానికి ఉన్నత స్థానంలో ఉన్నవారే బాధ్యత వహించాలని ఆయన అన్నారు. ఇటీవలి వరకు రాష్ట్ర వ్యవహారల ఇంచార్జ్‌గా పని చేసిన వీరప్ప మొయిలీ ఓటమికి పూర్తి బాధ్యత వహించాలన్నారు. మొయిలీ వల్ల రాష్ట్రంలో కాంగ్రెసు పూర్తిగా దెబ్బతిన్నదన్నారు. జగన్ గెలుపు వల్ల కాంగ్రెసుకు ఎలాంటి నష్టం లేదన్నారు.

మంత్రివర్గంలో పలువురిని తొలగించాలని సూచించారు. కోమటిరెడ్డి సోదరులు కాంగ్రెసులో ఉంటూ కాంగ్రెసును నష్ట పరిచే చర్యలు చేపడుతున్నారన్నారు. కడప, పులివెందుల ఉప ఎన్నికల ఫలితాలను స్వాగతిస్తున్నట్లు మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య చెప్పారు. ఈ వైఫల్యం కాంగ్రెసు నేతలు పోస్టుమార్టం నిర్వహించాల్సిన ఆవశ్యకతను చూపించిందన్నారు.

English summary
Ex chief minister Rosaiah said today that he is welcomes election. Congress senior leader Palvai Govardhan Reddy demand to take action on YS Jagan camp MLAs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X