వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేరళలో సెంటిమెంటు పునరావృతం: సాధారణ మెజార్టీతో గట్టెక్కిన కాంగ్రెస్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Oommen Chandy
న్యూఢిల్లీ: కేరళ ఓటర్లు గత మూడు దశాబ్దాల సెంటిమెంటును కొనసాగిస్తూ నిన్నటి వరకు విపక్షంలో కూర్చున్న కాంగ్రెసు ఆధ్వర్యంలోని యుడిఎఫ్‌కి సాధారణ ఆధిక్యాన్ని ఇచ్చి పట్టం గట్టారు. కమ్యూనిస్టుల ఆధ్వర్యంలోని ఎల్డీఎఫ్ కూటమి ఓడిపోయింది. కేరళలోని 140 సీట్లలో యూడిఎఫ్ కూటమి 72 స్థానాలలో విజయం సాధించగా, ఎల్డీఎఫ్ 68 సీట్లను గెలుచుకుంది. అయితే పార్టీ అధికారంలోకి రావడానికి కావాల్సిన సీట్లు 71 కంటే ఒక్క సీటే యుడిఎఫ్ ఎక్కువ సాధించింది. యుడిఎఫ్ స్వల్ప తేడాతోనే అధికార పీఠం కైవసం చేసుకుంది. యుడిఎఫ్ గెలుపుతో ముఖ్యమంత్రి అభ్యర్థి ఉమన్ చాందీ ఇంటి దగ్గర, పార్టీ కార్యాలయం దగ్గర కార్యకర్తల కోలాహలం కనిపించింది. ఆయనకు ఇది వరుసగా తొమ్మిదోసారి గెలుపు.

1970 నుండి అతను ఓడిపోకుండా గెలుస్తూ వస్తున్నారు. కేరళలో ఈసారైనా బోణీ కొట్టాలనుకున్న భారతీయ జనతా పార్టీ ఆశ మళ్లీ నెరవేరలేదు. కాగా కేరళ ముఖ్యమంత్రి విఎస్ అచ్యుతానందన్ మళంపుళా నియోజకవర్గం నుండి 23వేల ఆధిక్యంతో యుడిఎఫ్ అభ్యర్థిపై గెలుపొందారు. సిపిఎంలోని అంతర్గత విభేదాలే కేరళలో పుట్టిముంచినట్లుగా తెలుస్తోంది. సాక్ష్యాత్తూ ముఖ్యమంత్రి అచ్యుతానందన్‌కే సీటు కేటాయించడానికి మొదట సిపిఎం వెనుకాడింది. ముఖ్యమంత్రి అచ్యుతానందన్ శనివారం గవర్నర్‌కు రాజీనామా సమర్పించనున్నారు. పలువురు మంత్రులు కూడా ఈ ఎన్నికల్లో ఓడిపోయారు.

English summary
UDF won 72 seats and LDF won 68 seats out of 140. Chief minister VS Achyuthanandan will resign tomorrow for his post.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X