వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మానవ హక్కుల నేత, రచయిత బుర్రా రాములు మరణం

By Pratap
|
Google Oneindia TeluguNews

Telangana
వరంగల్: సుప్రసిద్ధ మానవహక్కుల నాయకుడు ప్రొఫెసర్ బుర్రా రాములు శనివారం నాడు మరణించారు. గత నాలుగు నెలలుగా ఆయన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. ఆయన మానవహక్కుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షునిగా ఉన్నారు. ఆయన పలు రచనలు చేశారు. ఆయన ఓ నవల కూడా రాశారు.

రెండున్నర దశాబ్దాలపైగా ప్రొఫెసర్ బుర్రా రాములు మానవహక్కుల ఉద్యమంతో పెనవేసుకుపోయి ఉన్నారు. ఎక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరిగితే అక్కడ నేనున్నానంటూ ఆయన ముందడుగు వేసేవారు. మానవ హక్కుల నేత డాక్టర్ బాలగోపాల్‌తో సన్నిహిత సంబంధాలు గల ప్రొఫెసర్ రాములు ఎన్నో నిజనిర్ధారణ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొన్నారు.

English summary
Human rights activist Burra Ramulu dead today. He was suffering from cancer.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X