హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ తెలంగాణ ప్లాన్, కాంగ్రెసుకు చెక్ పెట్టేందుకు

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యర్థి పార్టీల గుండెల్లో రైళ్లు పరిగెత్తించడానికి సిద్ధపడ్డారు. కడప, పులివెందుల ఉప ఎన్నికలతోనే కాదు, త్వరలో ఆయన జై తెలంగాణ నినాదం అందుకోనున్నట్లు తెలియడంతో ఇతర రాజకీయ పార్టీల్లో గుబులు పుడుతోంది. తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాలు సామరస్యపూర్వకంగా విడిపోవడానికి అవసరమైన ప్రాతిపదికను ఆయన రూపొందిస్తున్నట్లు ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రిక తెలిపింది. ఈ మేరకు ఓ వార్తాకథనాన్ని ప్రచురించింది. కడప ఉప ఎన్నికలకు ముందే వైయస్ జగన్ సీమాంధ్ర ప్రాంతంలో ఓ సర్వే నిర్వహించారని చెబుతున్నారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు తెలిపితే వైయస్ జగన్ ప్రతిష్ట, ఆదరణలకు విఘాతం కలుగుతుందా, కలగదా అనే విషయంపై లోతైన సర్వే జరిగినట్లు ఆ పత్రిక రాసింది. ఫలితాలు జగన్‌కు ఉత్సాహాన్నిచ్చే విధంగానే ఉన్నాయని అంటున్నారు. సర్వే ఫలితాలను ఆధారం చేసుకుని తెలంగాణ, సీమాంధ్ర విభజనకు సామరస్య పూర్వక పరిష్కారం కనుక్కోవడానికి సీమాంధ్రలో విస్తృతమైన చర్చకు జగన్ వ్యూహరచన చేస్తున్నట్లు చెబుతున్నారు. తెలంగాణపై నిర్ణయం తీసుకోవడానికి ముందు జగన్ సీమాంధ్రలో కొన్ని సమావేశాలు నిర్వహించి అభిప్రాయం తెలుసుకుంటారని అంటున్నారు.

సామరస్యపూర్వకంగా, అన్నదమ్ముల్లా విడిపోదామనే నినాదంతో తెలుగాణలో అడుగు పెడితే జగన్‌కు తిరుగులేని మద్దతు లభిస్తుందని అంటున్నారు. కాంగ్రెసు తెలంగాణ నాయకులు, కార్యకర్తలు జగన్‌ వెనక పూర్తిగా ర్యాలీ అవకాశాలుంటాయి. తెలంగాణలోని రెడ్లు ఏ మాత్రం సంశయించకుండా మద్దతిస్తారు. ఇటీవల తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభ్యుడు కెటి రామారావుకు, కాంగ్రెసు తెలంగాణ సీనియర్ నేత కె. కేశవ రావుకు మధ్య జరిగిన భేటీలో ప్రస్తావనకు వచ్చినట్లు చెబుతున్నారు.

English summary
Political parties and organisations fighting for Telangana are rattled not by the huge victory margin of YS Jaganmohan Reddy in the Kadapa Lok Sabha bypoll, but by indications emanating from his camp that the YSR Congress president is all set to sing the 'Jai Telangana' tune very soon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X