కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సాధ్యమైనంత త్వరగా ప్రభుత్వాన్ని కూల్చాలనే ఉంది: వైయస్ జగన్

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
కడప: రాష్ట్ర ప్రభుత్వాన్ని సాధ్యమైనంత తొందరగా ఇంటికి పంపేందుకే అన్ని ప్రయత్నాలు చేస్తున్నానని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైయస్‌.జగన్మోహన్‌రెడ్డి చెప్పారు. అయితే, అధికారపార్టీ కాంగ్రెసుతో ప్రతిపక్షం తెలుగుదేశం కుమ్మక్కుకావడం వల్ల అది సాధ్యం కావడం లేదన్నారు. కాంగ్రెసు సర్కారు ఎప్పుడు కూలుతుందా అని ప్రజలు ఎదురుచూస్తున్నారని, ఈ ప్రభుత్వం ఇంటికి పోయిన రోజున పేదల ముఖాల్లో ఆనందం తాండవిస్తుందని ఆయన చెప్పారు. కడప లోక్‌సభ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో శుక్రవారం ఘనవిజయం సాధించిన అనంతరం మీడియా ప్రతినిధులతో వైయస్‌ జగన్‌ మాట్లాడారు.

కడప ఉప ఎన్నికల్లో వైయస్‌ఆర్‌ కాంగ్రెసు అఖండ విజయం రాష్ట్రంలో రాజకీయ మార్పులకు నాంది కానుందని జగన్‌ చెప్పారు. కడప ఎన్నికల్లో వైయస్‌ఆర్‌ కాంగ్రెసు గెలుపుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలకు సేవ చేయాలన్న జ్ఞానోదయం కలుగుతుందన్నారు. కడప ఓటర్లు కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలకు గుణపాఠం చెప్పారని, కాంగ్రెసుతో జతకట్టిన తెలుగుదేశం పార్టీని తరిమికొట్టారని దుయ్యబట్టారు. తన తండ్రి వైయస్‌పై అభిమానంతో తనకు, తన తల్లికి పట్టం కట్టిన ఓటర్లందరికీ రుణపడి ఉంటానని కృతజ్ఞతలు తెలిపారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెసును ఆదరించడం ద్వారా వైయస్‌ తమ గుండెల్లో కొలువై ఉన్నారని ప్రజలు నిరూపించారన్నారు.

వరి మద్దతు ధర కోసం గుంటూరులో 48 గంటలపాటు తాను చేపట్టే దీక్షతోనైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు న్యాయం చేయాలన్నారు. వైయస్‌ రాజశేఖర రెడ్డి జయంతి రోజైన జులై 8న కడపజిల్లా ఇడుపులపాయలో రెండు రోజులపాటు వైయస్‌ఆర్‌ కాంగ్రెసు పార్టీ ప్లీనరీ సమావేశాలు నిర్వహించనున్నట్లు జగన్‌ వెల్లడించారు. ప్లీనరీలో విస్తృతంగా చర్చించి పార్టీ విధివిధానాలను ఖరారు చేస్తామన్నారు. ఉప ఎన్నికల్లో తమకు ఘనవిజయాన్ని అందజేసిన కడప ప్రజానీకానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ జగన్‌, విజయమ్మ.. హైదరాబాద్‌లోని వైయస్‌ఆర్‌ కాంగ్రెసు కార్యాలయం నుంచి శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

English summary
YSR Congress party leader YS Jagan said that he wants to dismantle Kiran Kumar Reddy's government as soon as possible.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X