హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ ఎమ్మెల్యేలను వదిలేస్తారా, కొత్త వారికే అవకాశం ఇస్తారా?

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: కడప, పులివెందుల ఉప ఎన్నికల తర్వాత వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వైఖరి మారినట్లు కనిపిస్తోంది. సాధ్యమైనంత ఎక్కువ మంది శానససభ్యులను కూడగట్టాలనే లక్ష్యం నుంచి ఆయన వెనక్కి తగ్గినట్లు చెబుతున్నారు. కేవలం సానుభూతి వల్లనే కాకుండా మార్పును కోరుకుంటున్నందున తనకు కడపలో భారీ మెజారిటీ వచ్చిందని ఆయన భావిస్తున్నారు. శాసనసభ్యుల తీరు పట్ల ఆయన విసుగు చెందినట్లు చెబుతున్నారు. తన వైపు వచ్చిన కాంగ్రెసు శాసనసభ్యురాలు కమలమ్మ, ప్రజారాజ్యం శాసనసభ్యుడు కాటసాని రాంరెడ్డి తిరిగి వెనక్కి వెళ్లారు.

శానససభ్యులను బుజ్జగించి తన వైపు నిలుపుకోవడం కూడా వృధా ప్రయాస అని ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు. తన వైపు గట్టిగా నిలబడేవారిని కాదనకుండా, కొత్తగా శాసనసభ్యులను తన వైపు తిప్పుకునే వ్యూహానికి స్వస్తి చెప్పి ముందుకు సాగాలని ఆయన అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆయన జాతీయ మీడియాతో మాట్లాడుతూ చేసిన ప్రకటనను అందుకు నిదర్సనంగా చెబుతున్నారు. పార్టీలో కొత్త ముఖాలకు అవకాశాలుంటాయని ఆయన చెప్పారు. దీన్నిబట్టి పాత గుర్రాలను బలవంతంగా తన వైపు తిప్పుకోవడం అనవసరమని ఆయన అనుకుంటున్నట్లు చెబుతున్నారు.

కడప లోకసభ స్థానంలోని అన్ని శాసనసభా నియోజకవర్గాల్లోనూ వైయస్ జగన్‌కు భారీ మెజారిటీ వచ్చింది. దీంతో ఆ స్థానాల్లోని శాసనసభ్యులకు వచ్చే ఎన్నికల్లో ఎదురు గాలి వీయక తప్పదని, తన హవా ముందు శాసనసభ్యుల సీనియారిటీ పనిచేయదని ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు. కొత్త గాలితో రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పాలని, దాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవాలని జగన్ భావిస్తున్నారని చెబుతున్నారు.

English summary
It is learnt that YSR Congress party president YS Jagan not interested in vowing MLAs. He wants accommodate new faces in his party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X