హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాబాయ్ వైయస్ వివేకానంద రెడ్డి ఓటమి బాధించింది: వైయస్ జగన్

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: పులివెందుల శాసనసభ ఉప ఎన్నికల్లో తన బాబాయ్ వైయస్ వివేకానంద రెడ్డి ఓటమి తనను బాధించిందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. వివేకానంద రెడ్డి తమ రక్తం పంచుకుని పుట్టినవారని, వివేకా ఓటమి తనను తప్పకుండా బాధిస్తుందని ఆయన అన్నారు. ఓ ప్రముఖ తెలుగు టీవీ చానెల్‌కు ఆయన శనివారం ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇప్పటికైనా వైయస్ వివేకానంద రెడ్డి పునరాలోచించుకోవాలని, వెనక్కి వస్తే సంతోషిస్తానని ఆయన అన్నారు.

ఎన్నికలకు సిద్దం కావాలని కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలకు ఆయన సవాల్ విసిరారు. ఉప ఎన్నికల్లో విజయం పాలు పొంగులాంటిదని వ్యాఖ్యానించిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఆయన ఆల్ ద బెస్ట్ చెప్పారు. ఎవరి సత్తా ఏమిటో తేల్చుకుందామని, తాను సవాల్ చేస్తున్నానని, తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలకు డిపాజిట్లు కూడా దక్కవని ఆయన అన్నారు. తాను తన తండ్రి ఫొటో పెట్టుకుని ఎన్నికల్లోకి దిగుతానని, కాంగ్రెసు సోనియా, రాహుల్ గాంధీల ఫొటోలు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేయాలని ఆయన అన్నారు.

సోనియా గాంధీ మాటకు తాను అంగీకరిస్తే రాజకీయంగా తాను ఎంతో ఎత్తులో ఉండేవాడినని, అయితే విశ్వసనీయత, వ్యక్తిత్వం, సమగ్రత ప్రశ్నలు తలెత్తాయని, దాంతో తాను ఆత్మగౌరవానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చానని, విశ్వసనీయతను నమ్ముకున్నానని ఆయన అన్నారు.

English summary
YSR Congress party leader YS Jagan said that YS Vivekananda Reddy's defeat is painful. He advised Vivekananda Reddy to rethink about his political future.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X