వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సామాన్యుడి నెత్తిన భారం: రూ.5 పెరిగిన పెట్రోలు ధరలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Petrol Prices
న్యూఢిల్లీ: పెట్రోలు ధరలు మళ్లీ పెంచారు. ఈసారి ఏకంగా ఐదురూపాయలు పెంచి సామాన్యుడిపై మరింత బరువు వేశారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ముందు వంగి వంగి పెట్టి ఇప్పుడు గట్టెక్కిన తర్వాత పెట్టిన దండాలకు కసి తీర్చుకున్నారు. ఓట్ల పండగ పూర్తి కాగానే బాదిపారేశారు. ఓటేసిన పాపానికి పెట్రో ధరలు పెంచి కాటేశారు. ఎన్నికల సమయంలో పెంచితే జనం ఎత్తి గోదాట్లో పడేస్తారని భయపడి నాలుగు నెలలుగా ఆగిన కేంద్రం ఆదివారం నుండి ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజే పెట్రో మంట పెట్టారు.

గతంలో ఎన్నడూ లేనంతగా ఒకేసారి లీటరు పెట్రోలు ధర ఐదు రూపాయలు పెంచారు. దీంతో లీటరు పెట్రోలు ధర ఢిల్లీలో రూ.63.37కు చేరుకుంది. రాష్ట్ర రాజధానిలో రూ.71లను తాకింది. శనివారం అర్ధరాత్రి నుంచే కొత్త ధరలు అమలులోకి వచ్చాయి. ఇది ఇంతటితో ఆగేలా లేదు! ముందుంది... మొసళ్ల పండగ! అతి త్వరలోనూ డీజిల్‌పై రూ.4, వంటగ్యాస్ సిలిండర్‌పై రూ.20 నుంచి 25 వరకు పెంచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తోంది. పెట్రోలుపైనా మరో విడత వడ్డన ఖాయంగా కనిపిస్తున్నాయి.

English summary
Within 24 hours of state election results oil marketing companies increased petrol prices by Rs 5 a litre, the steepest ever hike.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X