హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రేమ పెళ్లి ఆపడానికి హైదరాబాద్ టిటిడికి బాంబు బెదిరింపు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్: రాజధాని కేంద్రంలోని హిమయత్ నగర్‌లో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపానికి ఆదివారం గుర్తు తెలియని వ్యక్తుల నుండి బాంబు బెదిరింపు ఫోన్ వచ్చింది. దీంతో ఆ పరిసర ప్రాంతాలలో కలకలం రేగింది. అధికారులు వెంటనే అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే వచ్చిన బాంబు స్వ్కాడ్ పోలీసులు హుటాహుటీన కళ్యాణ మండపానికి చేరుకుని ప్రజలను దూరంగా పంపించివేశారు.

బాంబుస్క్వాడ్ రంగంలోకి దిగి తనిఖీలు నిర్వహించి, దాన్ని బెదిరింపు కాల్‌గా నిర్థారించింది. పోలీసులు ఫోన్‌కాల్‌ను ట్రేస్‌ చేసేందుకు ప్రయత్నాలు చేశారు. అయితే అదో ఉత్తుత్తి కాల్‌గానే తేలడంతో ఎక్కడనుండి ఎందుకు వచ్చిందనే విషయంపై దృష్టి సారించారు. టిటిడి కళ్యాణ మండపంలో జరగనున్న ఓ ప్రేమ పెళ్లిని ఆపడానికే కొందరు ఉద్దేశ్యపూర్వకంగా ఫోన్ చేసినట్టుగా అనుమానం వ్యక్తం చేశారు.

English summary
Hyderabad TTD received a threat call from unknown persons today. Bomb Squad suspected that call is trash.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X