హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కిరణ్‌పై ఫిర్యాదుకు ఎమ్మెల్యేలు రెడీ, పార్టీ తీరుపైనా అసంతృప్తి

By Pratap
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
హైదరాబాద్‌: కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి రాష్ట్రానికి వస్తున్న గులాం నబీ ఆజాద్‌ వద్ద ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై కత్తులు నూరేందుకు పార్టీ శాసనసభ్యులు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై శాసనసభ్యులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి తమకు అపాయింట్‌మెంటు కూడా ఇవ్వడం లేదని ఇటీవల హైదరాబాద్ శాసనసభ్యుడు విష్ణువర్దన్ రెడ్డి బహిరంగ విమర్శ చేసిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి అధికారులకు ఇచ్చిన ప్రాధాన్యం శాసనసభ్యలకు ఇవ్వడం లేదని ఆయన అన్నారు. తాను అధిష్టానానికి ఫిర్యాదు చేయనున్నట్లు కూడా తెలిపారు.

విష్ణువర్ధన్ రెడ్డి మాత్రమే కాకుండా పలువురు శాసనసభ్యులు కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహార శైలిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. కడప, పులివెందుల ఉప ఎన్నికల విషయంలో ఆయన వ్యవహరించిన తీరును కూడా వారు తప్పు పడుతున్నారు. ఎన్నికలు వస్తాయని తెలిసి కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకుని, కింది స్థాయిలో నాయకత్వాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయలేదని అంటున్నారు. పార్టీ తీరుపట్ల కూడా శాసనసభ్యులు అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు.

ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్‌కు, ముఖ్యమంత్రికి మధ్య పొసగడం లేదనే మాట కూడా వినిపిస్తోంది. ఇద్దరి మధ్య సమన్వయం కొరవడిందని చెబుతున్నారు. డి శ్రీనివాస్‌ను ముఖ్యమంత్రి పరిగణనలోకి తీసుకోవడం లేదని, అంతా ఒంటిచేతి మీద నడిపించాలని చూస్తున్నారని అంటున్నారు. ఇది పార్టీకి తీవ్ర నష్టం కలిగించవచ్చునని అంటున్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ కూడా ఇటీవల పరోక్షంగా ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడి తీరును తప్పు పట్టారు.

English summary
Congress MLAs are preparing to complain against CM Kiran Kumar Reddy. It is said that MLAs are not happy with the working style of CM.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X