హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చర్యలు తీసుకోకుంటే జగన్ వైపు మరికొంతమంది ఎమ్మెల్యేలు: వీరశివా రెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: కాంగ్రెసు పార్టీ తమ కుటుంబాన్ని చీల్చిందని వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అర్థరహిత ఆరోపణలు చేస్తున్నారని, కానీ వాస్తవంగా కుటుంబాలను చీల్చుతుంది జగనే అని కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు వీరశివారెడ్డి సోమవారం ఆరోపించారు. మంత్రి ధర్మాన ప్రసాదరావు సోదరుడిని తన వద్దకు జగన్ రప్పించుకోవడం కుటుంబాన్ని చీల్చడం కాదా అని ప్రశ్నించారు. గతంలో కూడా మంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డి సోదరుడిని రప్పించుకున్నారని ఆరోపించారు. ధర్మాన సోదరుడు క్రిష్ణదాసు సోనియాగాంధీ ఎవరో తెలియదు అని చెప్పడాన్ని ఆయన ఖండించారు.

కాంగ్రెసును వ్యతిరేకించే వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. జగన్ వెంట వెళుతున్న వారిపై వేటు వేయకపోతే రాష్ట్రంలో కాంగ్రెసు పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలకు పార్టీ తరఫున, శాసనసభ తరఫున షోకాజ్ నోటీసులు ఇచ్చామని గుర్తు చేశారు. మిగతా ఎమ్మెల్యేలపై త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ఆయన పార్టీ అధ్యక్షుడిని, పార్టీ విప్‌ను కోరారు. పార్టీ నిమిత్త మాత్రంగా వ్యవహరిస్తే జగన్ వెంట మరింత మంది ఎమ్మెల్యేలు వెళ్లే అవకాశం ఉంటుందని అన్నారు. జగన్ వర్గం ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని గులాం నబీ ఆజాద్‌ను కోరనున్నట్లు చెప్పారు.

English summary
MLA Veerashiva Reddy demanded action on YSR congress party president YS Jaganmohan Reddy camp MLAs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X