చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌కు శస్త్ర చికిత్స, క్షేమం

By Pratap
|
Google Oneindia TeluguNews

Rajinikanth
చెన్నై: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌కు సోమవారం చెన్నైలోని శ్రీ రామచంద్ర మెడికల్ సెంటర్‌లో శస్త్రచికిత్స జరిగింది. ఛాతీకి శస్త్రచికిత్స జరిపి ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన అదనపు నీటిని తొలగించారు. ఛాతీలోని ద్రవం ఒత్తిడి వల్ల శ్వాస తీసుకోవడం కష్టంగా మారిందని, దాంతో ద్రవాన్ని తొలగించామన వైద్యులు చెప్పారు. న్యుమోనియా, మూత్ర పిండాలు, కాలేయ సమస్యలతో రజనీకాంత్ శనివారం ఆస్పత్రిలో చేరారు.

శ్వాసకోశ సంబంధమైన ఇన్‌ఫెక్షన్‌ను వైద్యులు తొలగించారు. మూత్రపిండాలకు వైద్యం అందిస్తున్నామని, డయాలసిస్ చేయాల్సి వస్తుందా అనేది ఇప్పుడే చెప్పలేమని వైద్యులు చెప్పారు. రజనీకాంత్ ఆరోగ్యంగా ఉన్నారని, కీలక అవయవాలన్నీ సాధారణ స్థితిలోనే ఉన్నాయని వారన్నారు.

English summary
Actor Rajinikanth on Monday underwent a minor procedure at the Sri Ramachandra Medical Centre, where doctors removed the excess fluid that had accumulated in his lungs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X