వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ మూత్రపిండాలకు డయాలసిస్

By Pratap
|
Google Oneindia TeluguNews

Rajinikanth
చెన్నై: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌కు డయాలసిస్ చేస్తున్నట్లు అస్పత్రి వర్గాలు చెప్పాయి. ఆయనకు మరిన్ని రోజులు విశ్రాంతి అవసరమని తెలిపాయి. సోమవారం చెన్నైలోని శ్రీ రామచంద్ర మెడికల్ సెంటర్‌లో రజనీకి శస్త్రచికిత్స జరిగింది. ఛాతీకి శస్త్రచికిత్స జరిపి ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన అదనపు నీటిని తొలగించారు. ఛాతీలోని ద్రవం ఒత్తిడి వల్ల శ్వాస తీసుకోవడం కష్టంగా మారిందని, దాంతో ద్రవాన్ని తొలగించామన వైద్యులు చెప్పారు. న్యుమోనియా, మూత్ర పిండాలు, కాలేయ సమస్యలతో రజనీకాంత్ శనివారం ఆస్పత్రిలో చేరారు.

శ్వాసకోశ సంబంధమైన ఇన్‌ఫెక్షన్‌ను వైద్యులు తొలగించారు. మూత్రపిండాలకు వైద్యం అందిస్తున్నామని, డయాలసిస్ చేయాల్సి వస్తుందా అనేది ఇప్పుడే చెప్పలేమని వైద్యులు చెప్పారు. రజనీకాంత్ ఆరోగ్యంగా ఉన్నారని, కీలక అవయవాలన్నీ సాధారణ స్థితిలోనే ఉన్నాయని వారన్నారు. రజనీకాంత్ ఆరోగ్య సమస్యలతో బాధపడుతుండడంతో రాణా షూటింగ్‌కు అంతరాయం ఏర్పడుతోంది.

English summary
Actor Rajinikanth on Monday underwent a minor procedure at the Sri Ramachandra Medical Centre, where doctors removed the excess fluid that had accumulated in his lungs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X