హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆజాద్ సాక్షిగా సీమాంధ్ర, తెలంగాణ ఎంపీల మధ్య విభేదాలు, చీలిక

By Pratap
|
Google Oneindia TeluguNews

Ghulam Nabi Azad
హైదరాబాద్: కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ సాక్షిగా పార్టీ సీమాంధ్ర, తెలంగాణ పార్లమెంటు సభ్యుల మధ్య చీలిక వచ్చింది. ఇరు ప్రాంతాల ఎంపీల మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి. పార్లమెంటు సభ్యులందరూ కలిసి తన వద్దకు రావాలని ఆజాద్ చేసిన సూచనను తెలంగాణ ఎంపీలు తిరస్కరించారు. సీమాంధ్ర పార్లమెంటు సభ్యులతో కలిసి వచ్చేది లేదని తేల్చి చెప్పారు. తెలంగాణ పార్లమెంటు సభ్యులు సమావేశాన్ని బహిష్కరించారు. తమకు తెలంగాణ తప్ప మరోటి అవసరం లేదని వారు చెప్పారు. వారు బయటే ఉండిపోయారు.

సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు మాత్రం ఆజాద్‌తో సమావేశమయ్యారు. తమకు తెలంగాణ ఎంపిలతో కలిసి కూర్చోవడానికి అభ్యంతరం లేదని వారు చెప్పారు. కావూరి సాంబశివ రావుతో పాటు సీమాంధ్ర ఎంపీలు ఆజాద్‌తో సమావేశమయ్యారు. తెలంగాణ సమస్యను త్వరగా పరిష్కరించాలని కావూరి సాంబశివ రావు ఆజాద్‌ను కోరినట్లు సమాచారం. తెలంగాణ సమస్య పరిష్కారంలో జాప్యం చేస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్రంగా దెబ్బ తింటుందని ఆయన చెప్పారని అంటున్నారు.

English summary
Congress Telangana MPs rejected to meet Gulam Nabi azad with Seemandhra MPs. Telangana MPs boycotted the meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X