అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాబా జీవించి ఉన్నప్పుడు మాదిరిగానే వేడుకలు: ట్రస్టు

|
Google Oneindia TeluguNews

Sathya Sai Baba
ఆధ్యాత్మిక గురువు భగవాన్ శ్రీ సత్య సాయి బాబా కాలం చేసి దాదాపు నెల కావస్తున్న తరుణంలో, అనంతపూర్ జిల్లాలోని ఆయన ఆశ్రమమైన పుట్టపర్తిలో వివిధ ప్రాంతీయ పండుగలను యథావిథా కొనసాగిస్తున్నారు. పలు ప్రాంతీయ పండుగలు, ఉత్సవాలను ఎప్పటిలాగే కొనసాగించేందుకు బాబా సామ్రాజ్యాన్ని నిర్వహిస్తున్న శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్ట్ వివిధ ప్రాంతాలు, దేశాల నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు ట్రస్టు పేర్కొంది.

బాబా జీవించి ఉన్నప్పుడు ఏవిధంగా అయితే పూజలు, కార్యక్రమాలు నిర్వహించారో ఇప్పుడు కూడా అలాగే జరుగుతాయని ట్రస్టు అధికారులు పేర్కొన్నారు. గౌతమ బుద్ధుని జన్మదినాన్ని పురస్కరించుకొని జరుపుకునే బుద్ధ పూర్ణిమ కోసం ప్రశాంతి నిలయం (బాబా సమాధి అయిన చోటు)లో భారీ ఏర్పాట్లను చేశారు. రెండు రోజుల పాటు జరిగే ఈ సంబరాల కోసం ఇప్పటికే బ్రూనీ, ఇండోనేషియా, మలేషియా, నేపాల్, సింగపూర్, థాయ్‌లాండ్, శ్రీలంక, వియత్నాం దేశాల నుంచి దాదాపు 700 మందికి పైగా భక్తులు పుట్టపర్తికి చేరుకున్నట్లు అధికారులు వివరించారు. ఏప్రిల్ 24న బాబా మరణించిన తర్వాత విదేశాల నుంచి ఇంత భారీ సంఖ్యలో భక్తులు పుట్టపర్తికి రావడం ఇదే మొదటిసారి.

బాబా కాలం చేయడంతో పుట్టపర్తి ప్రాభవం తగ్గిపోతున్న తరుణంలో ఈ ప్రాంతానికి యథాస్థాయిని కల్పించేందుకు ట్రస్టు ముమ్మరంగా కృషి చేస్తుంది. భక్తులను ఆకట్టుకునేందుకు భారీ స్థాయిలో కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఈ నెల ఆరో తేదీన కూడా ట్రస్టు "ఈశ్వరమ్మ జన్మదినోత్సం"ను (సత్య సాయి బాబా తల్లి ఈశ్వరమ్మ పుట్టిన రోజు) నిర్వహించి పేద ప్రజల కోసం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించింది. కాగా.. చైర్మన్ లేకుండానే ట్రస్టు సభ్యులు బాబా ట్రస్టును నిర్వహిస్తున్నారు. చైర్మన్ పదవిని ఎప్పటికీ ఖాలీగానే ఉంచాలని ట్రస్టీలు నిర్ణియించారు. బాబా స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని, ఆ పదివికి బాబానే ఎల్లప్పటికీ చైర్మన్‌గా ఉండాలనేది వారి భావన.

English summary
Nearly a month after the demise of spiritual leader Sathya Sai Baba, his ashram at Puttaparthi in Andhra Pradesh's Anantapur district has started celebrating religious festivals.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X