భార్యను కరిచిన వ్యాధిగ్రస్తుడు: భర్త మృతి, చికిత్స పొందుతున్న భార్య
Districts
oi-Srinivas G
By Srinivas
|
కాకినాడ: గోదావరి జిల్లాలో రేబిస్ వ్యాధి సోకిన సుబ్బారావు అనే వ్యక్తి ఆ వ్యాధి ముదరడంతో తన భార్యను కరిచాడు. దీంతో ఆమెకు కూడా వ్యాధి సోకి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఉండ్రజరానికి చెందిన సుబ్బారావు అనే వ్యక్తికి కొద్దిరోజుల క్రితం కుక్క కరిచింది. దీంతో అతనికి రేబిస్ సోకింది. అయితే వ్యాధి ముదిరి చికిత్స నిమిత్తం కాకినాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
అయితే ఆసుపత్రిలో ఉంటూ అతనికి సపర్యలు చేస్తున్నభార్య నాగమణిని కరిచాడు. దీంతో ఆమెకు కూడా వ్యాధి సోకినట్లుగా తెలుస్తోంది. ఆమె పరిస్థితి కూడా విషమంగా ఉండటంతో ఆదే ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కాగా సుబ్బారావు వ్యాధి ముదిరి చనిపోయాడు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి