హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నష్టనివారణ చర్యలకు దిగిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
హైదరాబాద్: కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్‌కు తనపై ఫిర్యాదులు వెల్లువెత్తిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నష్టనిరారణ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. రెండు రోజుల పర్యటనకు వచ్చిన ఆజాద్‌కు ముఖ్యమంత్రిపై అన్ని వైపుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దానికి ముఖ్యమంత్రి తీవ్ర ఆవేదనకు గురైనట్లు తెలుస్తోంది. దీంతో ఆయన నష్టనివారణ చర్యలు చేపట్టేందుకు సిద్ధపడ్డారు. మీలో తాను ఒక్కడినని మంత్రులకు, శానససభ్యులకు, ఎమ్మెల్సీలకు, పార్లమెంటు సభ్యులకు చెప్పేందుకు ఆయన ప్రయత్నాలు మొదలు పెట్టారు.

ముఖ్యమంత్రి ఈ నెల 23వ తేదీన శాసనసభ్యులు, ఎమ్మెల్సీలతో సమావేశం ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఆ తర్వాత పార్లమెంటు సభ్యులను, నాయకులను కలుసుకుంటారని తెలుస్తోంది. ఈ సమావేశాలకు ఎజెండా ఏమీ ఉండదని, మీలో నేను ఒక్కడిని అనే విషయాన్ని వారికి చేరవేయడమే ముఖ్యమంత్రి ఉద్దేశమని చెబుతున్నారు. శాసనసభ్యులు, ఎమ్మెల్సీలతో సమావేశం తర్వాత మంత్రివర్గంలోకి కొత్తవారిని తీసుకుంటారని, శాఖలను మారుస్తారని, తద్వారా మంత్రుల్లో శాఖల కేటాయింపుపై ఉన్న అసంతృప్తిని తొలగిస్తారని చెబుతున్నారు. రెండు రోజుల హైదరాబాదు పర్యటనలో ముఖ్యమంత్రిని సమర్థించినవారు ఆజాద్‌కు కనిపించలేదని చెబుతున్నారు. పెట్టారు.

English summary
In the aftermath of complaints against his style functioning to Gulam Nabi Azad, AICC in charge of Andhra Pradesh affairs, chief minister N Kiran Kumar Reddy is seriously thinking of reconciliatory moves towards his critics in the cabinet and the party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X