చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఐసియులోకి తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్: కిడ్నీలకు డయాలసిస్

By Pratap
|
Google Oneindia TeluguNews

Rajinikanth
చెన్నై: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఆరోగ్యం ఆందోళనకరంగా మారినట్లు తెలుస్తోంది. ఆయనను బుధవారం ఐసియులోకి మార్చారు. మూత్రపిండాలకు డయాలసిస్ చేస్తున్నారు. రెండు రోజుల క్రితం ఆయన ఛాతీకి శస్త్రచికిత్స చేసి ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన నీటిని తొలగించారు. శనివారం నుంచి ప్రైవేట్ వార్డులో చికిత్స పొందుతున్న ఆయనను ఐసియులోకి మార్చి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

మూత్ర పిండాలు సరిగా పని చేయకపోవడం డయాలసిస్ చేయక తప్పడం లేదని వైద్యులు చెప్పారు. శరీరంలో సోడియం, ప్రోటీన్ స్థాయిలు తగ్గుతున్నాయని వైద్యులు చెప్పారు. శ్వాస సంబంధమైన సమస్యతో రజనీకాంత్ ఆస్పత్రిలో చేరారు. ఆయనకు వైద్యులు యాంటీ బయాటిక్స్ ఇచ్చారు. రక్తం కూడా ఎక్కించారు. ఆయనను హీమోడయాలసిస్ కింద ఉంచాలని నిర్ణయించినట్లు వైద్యులు చెప్పారు. మూత్ర పిండాలు సాధారణ స్థాయికి చేరుకుంటాయని ఆశిస్తున్నట్లు వారు తెలిపారు. కింది శ్వాస నాళం ఇన్‌ఫెక్షన్ తొలగిపోతే సమస్య పరిష్కారమవుతుందని వారు చెప్పారు. రజనీకాంత్‌ను సందర్శించడానికి వస్తున్నవారిపై వైద్యులు ఆంక్షలు పెట్టారు.

English summary
Actor Rajinikanth's condition worsened on Wednesday with doctors putting him through dialysis at a Chennai hospital, two days after he underwent a procedure to drain fluid accumulated in his lungs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X