వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తీర్పు వినగానే స్పృహ తప్పి పడిపోయిన డిఎంకె ఎంపి కనిమొళి

By Pratap
|
Google Oneindia TeluguNews

Kanimozhi
న్యూఢిల్లీ: 2జి స్పెక్ట్రమ్ స్కామ్ కేసులో ప్రత్యేక కోర్టు తీర్పు వినగానే డిఎంకె పార్లమెంటు సభ్యురాలు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ముద్దుల కూతురు కనిమొళి గురువారం స్పృహ తప్పి పడిపోయారు. తనకు బెయిల్ నిరాకరిస్తూ కోర్టు నిర్ణయం వెలువరించగానే ఆమె కంట తడి పెట్టుకున్నారు. స్పృహలోకి వచ్చిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు. తీర్పునకు ఆశ్చర్యం కలిగించలేదని, ఇది ఊహించిందేనని ఆమె అన్నారు.

కనిమొళిని అరెస్టు చేసి తీహార్ జైలుకు తరలించారు. తాను ఎదుర్కుంటానని, భయపడేది లేదని ఆమె అన్నారు. కలైంగర్ టీవీ చానెల్‌లో తాను వాటాదారును మాత్రమేనని, తనకు ఆర్థిక లావాదేవీలతో సంబంధం లేదని కనిమొళి చేసిన వాదనను కోర్టు తోసిపుచ్చింది. 2జి స్పెక్ట్రమ్ స్కామ్‌లో టెలికం మాజీ మంత్రి ఎ రాజాతో కనిమొళి కుమ్మక్కయి, 200 కోట్ల రూపాయలకు పైగా ముడుపులు తీసుకున్నట్లు సిబిఐ ఆరోపించింది. కరుణానిధికి కనిమొళి మూడో భార్య కూతురు. జైలులో కనిమొళికి ప్రత్యేక ఏర్పాట్లు ఏవీ లేవని అధికారులు చెప్పారు.

English summary
Kanimozhi arrested and sent to Tihar jail in 2G spectrum scam. she said that court order is expected.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X