వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తీహార్ జైలులో కరుణ కుమార్తె కనిమొళికి లగ్జరీ సౌకర్యాలు

|
Google Oneindia TeluguNews

Kanimozhi
రెండవ తరం (2జీ) స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో కోట్లు నొక్కేశారని వస్తున్న ఆరోపణల నేపథ్యంలో అరెస్టయిన కనిమొళి ప్రస్తుతం తీహార్ జైళ్లో టీవీ చూస్తే గడిపేస్తుంది. అదేంటి సాధారణంగా అందరూ ఊచలు లెక్కబెడుతుంటారని అంటారా, మీరు ఇలా చెబుతున్నారేంటి అంటారా..! అవును మరి సాధారణ ఖైదీలయితే ఊచలు లెక్కబెడుతారు. కానీ కనిమొళి స్పెషల్ కదా అందుకే ఈ సౌకర్యాలు. ఒక్క టీవీ ఏం కర్మ.. కనిమొళిని ఖైదు చేసిన తీహార్ జైలు ఎనిమిదో మహిళా వార్డును ఆరో నెంబర్ జైలులో ఆమె కోసం అటాచ్డ్ బాత్‌రూమ్, ఫ్యాన్, లైట్ సౌకర్యాలు, సౌత్ ఇండియన్ ఫుడ్ వంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి.

జైలు నెం.6లో మాధురి గుప్తా (ఇస్లామాబాద్‌లోని ఇండియన్ హై కమిషన్‌లో భారత రాయబారిగా పనిచేస్తూ పాకిస్థాన్‌కు గూఢచర్యం చేసినందుకుగా శిక్ష పొందుతోంది), సోను పంజబన్ (అమ్మాయిలను తార్చే కేసులో అరెస్టయిన మహిళ) మరియు ఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ కొన్సిలర్ శారదా జైన్ (హత్య కేసులో అరెస్టయిన మహిళ)లు ఉన్నారు. వారితో పాటే కనిమొళిని కూడా జైలు నెం. 6లో బంధించారు. అయితే కనిమొళికి ఇన్ని సౌకర్యాలు కల్పించినప్పటికీ అందరు ఖైదీల మాదిరిగానే జైలు షెడ్యూల్ పాటించాల్సి ఉంటుంది. కనిమొళికి ఓ కప్పుకునేందుకు ఓ దుప్పటిని మాత్రమే ఇచ్చారు, కఠిక నేలపై ఆమె నిద్రపోవాల్సి ఉంటుంది.

ఇక కలైంగర్ టివి ఎండీ, సీఈఓ శరద్ కుమార్‌ను కామన్‌వెల్త్ కుంభకోణం కేసులో అరెస్టయిన సురేష్ కల్మాడీ, సర్జీత్ లాల్, ఏఎస్‌జీ ప్రసాద్‌లతో అదే తీహార్ జైలులోని పురుషుల వార్డులో జైలు నెం.4లో బంధించారు. జైలు నిబంధనల ప్రకారం వారానికి రెండుసార్లు మాత్రమే కనిమొళిని తన బంధువులు కలుసే వీలు ఉంటుందని జైళ్ల శాఖ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆర్.ఎన్.శర్మ తెలిపారు. 2జీ కేసులో కనిమొళి బయట ఉంటే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని సిబిఐ కోర్టును కోరడంతో ఆమెకు బెయిల్‌ను నిరాకరించి అరెస్టుకు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. దీంతో శుక్రవారం 4.30లకు కనిమొళి అరెస్టయింది. అంతుకు ముందు ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఇది (అరెస్టును) తాను ఉహిస్తూనే ఉన్నానని చెప్పారు.

English summary
Tamil Nadu former chief minister M. Karunanidhi's daughter, DMK MP Kanimozhi is in jail number 6, which is women's cell, and ward number 8. She is kept in a separate cell with attached toilet. The cell has television, fans and light. She can have south Indian food.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X