హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎస్ఎస్‌సి ఫలితాల్లో బాలికలదే హవా, హైదరాబాద్ చివరి స్థానం

By Pratap
|
Google Oneindia TeluguNews

SSC Results 2011
హైదరాబాద్‌: పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ఎప్పటిలాగే బాలికలు తమ సత్తా చాటారు. బాలురపై వారిదే పైచేయిగా ఉంది. పదో తరగతి పరీక్షా ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఎస్‌ఎస్‌సీ బోర్డు కార్యాలయంలో మాధ్యమిక విద్యాశాఖ మంత్రి పార్థసారధి ఈ ఉదయం 11.30 గంటలకు ఫలితాలను విడుదల చేశారు. ఉత్తీర్ణులయిన విద్యార్థులకు మంత్రి అభినందనలు తెలిపారు. గత ఏడాదికి భిన్నంగా కొత్త గ్రేడింగ్‌ విధానంలో ఫలితాలను వెలువరించారు. ఈ ఏడాది 83.1 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఉత్తీర్ణత 1.41 శాతం పెరిగింది. 91.57 శాతం ఉత్తీర్ణతతో కరీంనగర్‌ జిల్లా ప్రథమస్థానంలో నిలవగా 72.76 శాతం ఉత్తీర్ణతతో హైదరాబాద్‌ చివరి స్థానంలో ఉంది. రెండోసారి వరుసగా హైదరాబాద్‌ చివరిస్థానంలో నిలిచింది.

ఫలితాల్లో బాలురపై బాలికలు పైచేయి సాధించారు. బాలుర ఉత్తీర్ణత 82.1 శాతం కాగా బాలికల ఉత్తీర్ణత శాతం 83.5 శాతం. 444 జడ్పీ పాఠశాలలు, 88 ప్రభుత్వ పాఠశాలల్లో వంద శాతం ఉత్తీర్ణత నమోదయ్యింది. ఈనెలాఖరుకల్లా మార్కుల మెమో అందిస్తామని మంత్రి వెల్లడించారు. జూన్‌ 18 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. రీకౌంటింగ్‌కు ఈనెల 23 నుంచి 15 రోజుల గడువు ఉందని తెలియజేశారు.

ఈ రోజు విడుదలైన పదో తరగతి పరీక్షా ఫలితాల్లో జిల్లాల వారీ ఉత్తీర్ణతా శాతం ఈ విధంగా ఉంది.

కరీంనగర్‌ - 91.57
గుంటూరు - 91.32
నల్గొండ - 89.89
చిత్తూరు - 88.70
కడప - 87.62
పశ్చిమగోదావరి - 86.72
మహబూబ్‌నగర్‌ - 85.83
కృష్ణా - 85.68
మెదక్‌ -85.58
నిజామాబాద్‌ - 85.18
వరంగల్‌ - 84.38
ప్రకాశం - 83.27
తూర్పుగోదావరి - 82.21
ఆదిలాబాద్‌ - 81.51
విశాఖ - 81.07
ఖమ్మం - 80.83
విజయనగరం - 80.65
నెల్లూరు - 80.63
కర్నూలు - 78.99
శ్రీకాకుళం - 78.17
రంగారెడ్డి - 75.26
హైదరాబాద్‌ - 72.76

English summary
SSC results released today by minister Parthasarathy. Girls tops in the results over boys.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X