హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మెరుగు పడుతున్న కాంగ్రెసు సీనియర్ నేత జి. వెంకటస్వామి ఆరోగ్యం

By Pratap
|
Google Oneindia TeluguNews

G Venkataswamy
హైదరాబాద్‌: కాంగ్రెసు సీనియర్ నేత జి. వెంకటస్వామి ఆరోగ్యం మెరుగుపడుతోందని ఆస్పత్రి వైద్యులు చెప్పారు. ఈ మేరకు వారు శనివారం మధ్యాహ్నం బులిటెన్ విడుదల చేశారు. తీవ్ర అస్వస్థతకు గురై శుక్రవారం సాయంత్రం ఆయన ఆస్పత్రిలో చేరారు. గురువారం సాయంత్రం ఆయనకు తీవ్రస్థాయిలో గుండెపోటు రావడంతో సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో చేర్పించారు.

గుండెపోటుతో ఇబ్బంది పడుతున్న కాకాకు వెంటిరేటర్‌పై వైద్యం కొనసాగిస్తున్నట్లు వైద్యులు వెల్లడించారు. ఐసీయూలో కాకా చికిత్స పొందుతున్నారు. శ్వాసతీసుకోవడం కష్టంతో ఉండటంతో, ఇప్పుడే కాకా ఆరోగ్య పరిస్థితిని గురించి వివరాలు చెప్పలేమని వైద్యులు అంటున్నారు. కాగా, కాకాను శనివారం వీహెచ్, గద్దర్ తదితర రాజకీయ నేతలు పరామర్శించారు.

English summary
Doctors said that Congress senior leader G Venkataswamy's health is stable. He is admitted in Yasoda hospital on friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X