సిఎం, జగన్ ఎదురు పడ్డారు: ఎంపీ కూతురి పెళ్లిలో జై జగన్ నినాదాలు
State
oi-Srinivas G
By Srinivas
|
అనంతపురం: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ ఆదివారం అనంతరపురం జిల్లా పార్లమెంటు సభ్యుడు అనంత వెంకటరామిరెడ్డి కూతురు పెళ్లిలో హాజరయ్యారు. ఈ పెళ్లిలో కిరణ్, జగన్ ఇద్దరూ పాల్గొనడంతో అందరి దృష్టి వారిపై పడింది. కాగా ఈ పెళ్లికి హాజరైన పలువురు మంత్రులకు జగన్ కార్యకర్తల నుండి చేదు అనుభవం ఎదురయింది.
పెళ్లిలో పాల్గొన్న మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, బొత్స సత్యనారాయణ, రఘువీరారెడ్డి, అహ్మదుల్లాలు పెళ్లికి వచ్చినప్పుడు జగన్ పార్టీ కార్యకర్తలు వారిని అడ్డుకొని జై జగన్ అంటూ నినాదాలు చేశారు. దీంతో అక్కడ పరిస్థితి కాస్త కొద్ది సేపు ఉద్రిక్తంగా మారింది.