వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్ జగన్‌కు చెక్ చెప్పేందుకు తెరపైకి కెవిపి: ఆజాద్ వ్యూహం!

By Srinivas
|
Google Oneindia TeluguNews

KVP Ramachandra Rao
హైదరాబాద్: వైయస్ రాజశేఖరరెడ్డి మృతి అనంతరం మాజీ ముఖ్యమంత్రి రోశయ్య హయాంలోనూ తన మాట చెల్లుబాటు చేసుకున్న ప్రభుత్వ సలహాదారు, రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావు ఒక్కసారిగా మళ్లీ తెరపైకి వచ్చారు. రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించేందుకు సన్నద్ధమవుతున్నారు. కానీ కిరణ్‌కుమార్ రెడ్డి సిఎం అయ్యాక రాష్ట్ర రాజకీయాల్లో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. జగన్ కొత్త పార్టీ పెట్టి కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదే సమయంలో జగన్ పలు దీక్షలు చేపట్టడం వాటిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పాల్గొనడం వంటివి కొనసాగుతున్నాయి. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ కడప ఉప పోరులోనూ కేవీపీ పాత్ర ప్రత్యక్షంగా ఎక్కడా కనిపించలేదు. గతంలో అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు కేవీపీ అసెంబ్లీ ప్రాంగణంలో కన్పించేవారు. రోశయ్య సిఎం అయినా ఆయన ఇదే పంథాను అనుసరిస్తూ వచ్చారు.

కానీ సిఎం అయ్యాక కిరణ్ చేసిన ప్రకటన మేరకు అందరితో పాటు కేవీపీ కూడా ప్రభుత్వ సలహాదారు పదవికి రాజీనామా చేశారు. ఈ రాజీనామా ఇంతవరకూ ఆమోదం పొందలేదు. అయినా కాంగ్రెస్ రాజకీయాల్లో కేవీపీ అంటీముట్టనట్టుగానే వ్యవహరిస్తూ వచ్చారు.
ఇటీవల ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్ రెండు రోజుల రాష్ట్ర పర్యటనకు వచ్చిన తర్వాత మళ్లీ కెవిపి హవా స్పష్టంగా కన్పిస్తోందని పార్టీ నేతలు చెబుతున్నారు. కెవిపి సేవలను పార్టీ కోసం వినియోగించుకోవాలని ఆజాద్ భావిస్తున్నట్లు సమాచారం. ఇందుకు ప్రధాన కారణం జగన్ వెంట నడిచే ఎమ్మెల్యేలలో చాలా మందికి కేవీపీ అంటే గౌరవం ఉంది. దీన్ని ఆజాద్ గ్రహించారని జగన్‌కు చెక్ పెట్టాలంటే కెవిపి సేవలను పార్టీ కోసం సమర్ధంగా వినియోగించుకోవాలని ఆయన భావిస్తున్నట్లు పార్టీనేతలు చెబుతున్నారు. ప్రభుత్వానికి పార్టీకి సమన్వయం కల్పించే పిసిసి కమిటీలో సభ్యుల్లో కెవిపి ఒకరు. మొత్తానికి ఆజాద్ రాకతో మళ్లీ కాంగ్రెస్‌లో కేవీపీ పాత్ర ఒక్కసారిగా తెరపైకి వచ్చింది.

English summary
Central minister Gulam Nabi Azad is thinking to return KVP Ramachandra Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X