వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేంద్రం వైఖరిలో మార్పు లేదు: ఎస్సార్సీ పై నోరు మెదిపిన చిదంబరం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chidambaram
న్యూఢిల్లీ: తెలంగాణపై కేంద్రం వైఖరిలో ఎలాంటి మార్పు లేదని కేంద్ర హోంశాఖ మంత్రి చిదంబరం సోమవారం విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు. ఉత్తర ప్రదేశ్‌లో ప్రత్యేక రాష్ట్రాల డిమాండ్ వచ్చినందున ఎస్సార్సీకి కాంగ్రెసు పార్టీ తీర్మానం చేసిన నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్‌లో తీవ్ర ప్రకంపనలు వచ్చిన విషయం తెలిసిందే. తెలంగాణపై కూడా ఎస్సార్సీ వేయాలని సీమాంధ్ర నేతలు, అవసరం లేదని తెలంగాణ నేతలు చెప్పడంతో చిదంబరం స్పందించారు. తెలంగాణ విషయంలో కేంద్రం వైఖరిలో ఎలాంటి మార్పు లేదని చెప్పారు. త్వరలో అఖిల పక్ష భేటీ నిర్వహిస్తామని అన్నారు. అయితే ఇంకా తేది ఖరారు కాలేదన్నారు.

కాగా కర్నాటక గవర్నర్ హెచ్ఆర్ భరద్వాజ్‌ను వెనక్కి పిలిపించాలన్న భారతీయ జనతాపార్టీ డిమాండును ఆయన తోసిపుచ్చారు. భరద్వాజ్‌ను వెనక్కి పిలిపించే సమస్య లేదన్నారు. ఆయన తన విధులు తాను నిర్వర్తించారని అన్నారు. నిర్ణయం తీసుకోవాల్సింది మాత్రం తామే అని అన్నారు.

English summary
Central Minister Chidambaram said today that centre did not changed decision on Telangana issue. He said he will conduct all party meeting soon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X