హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లోకేష్ జగన్‌కు ప్రత్యామ్నాయం కాదు: టిడిపి ఎంపీ శివప్రసాద్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Telugudesam
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు తనయుడు నారా లోకేష్ కుమార్ రాజకీయ ఆరంగేట్రం వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి ప్రత్యామ్నాయం కాదని చిత్తూరు జిల్లా పార్లమెంటు సభ్యుడు శివప్రసాద్ అన్నారు. జాతీయ రాజకీయాల్లో ఇప్పటికే చంద్రబాబు కీరోల్ పోషిస్తున్నారని అన్నారు. తెలుగుదేశం పార్టీలో వారసత్వ పోరు ఇప్పటికిప్పుడు అవసరం లేదన్నారు. చంద్రబాబు మరో 20 ఏళ్లు పార్టీని నడిపిస్తారని అన్నారు. అలాంటప్పుడు వారసత్వం గురించి ఇప్పిడే అలోచించాల్సిన అవసరం లేదన్నారు.

జిల్లాలో లోకేష్ నాయకత్వం వహిస్తే అందరికంటే ముందుగా సంతోషించేది తానే అని శివప్రసాద్ అన్నారు. లోకేష్ కు నాయకత్వ లక్షణాలు బాగా ఉన్నాయని అన్నారు. ఆయనకు నాయకుడిగా నడిపించే సమర్థత కూడా ఉందన్నారు. లోకేష్‌పై ఇప్పుడే మండల స్థాయిలో మొదలైన ఆశ ముందు ముందు రాష్ట్రవ్యాప్తంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.

English summary
TDP Chittoor MP Shiva Prasad said that Lokesh Kumar political entry in not alternate to YSR Congress party president YS Jaganmohan Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X