హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణపై రెండో ఎస్సార్సీకి రాజకీయ నాయకుల తీవ్ర వ్యతిరేకత

By Pratap
|
Google Oneindia TeluguNews

Telangana
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు రెండో రాష్ట్రాల పునర్విభజన కమిషన్ (రెండో ఎస్సార్సీ) ఏర్పాటు చేయాలనే కేంద్ర ప్రభుత్వం ఆలోచనను అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. రెండో ఎస్సార్సీ పేరుతో కేంద్రం కొత్త సమస్యలను సృష్టించాలని చూస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు విమర్శించారు. రెండో ఎస్సార్సీకి తమ పార్టీ వ్యతిరేకమన్నారు. ప్రభుత్వ పనితీరును ఆయన ఎండగట్టారు. వరికి రాష్ట్ర ప్రభుత్వమే రూ.200 బోనస్‌ ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. గనులపై కేంద్ర విధానం ప్రకటించేవరకూ రాష్ట్రంలో తవ్వకాలు ఆపాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. ఉప ఎన్నికల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.

తెలంగాణకు, రెండవ ఎస్సార్సీకి ఎంటువంటి సంబంధంలేదని బిజెపి సీనియర్ నేత విద్యాసాగర్ రావు అన్నారు. తెలంగాణ ఏర్పాటుకు రెండవ ఎస్సార్సీ అవసరంలేదని ఆయన అభిప్రాయపడ్డారు. అందరూ ఉద్యమాన్ని నిర్మించవలసిన అవసరం ఉందన్నారు. అవిశ్వాసతీర్మానం ప్రవేశపెట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప లోక్ సభ సభ్యుడు జగన్మోహన రెడ్డి సవాల్ చేస్తున్నా ఎందు వెనకాడుతున్నారో టిడిపి వారు సమాధానం చెప్పాలన్నారు. అవిశ్వాస తీర్మానం అంటే ప్రభుత్వాన్ని పడగొట్టడం కాదని, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపడం అని వివరణ ఇచ్చారు. తెలంగాణను అడ్డుకోవడానికే చంద్రబాబు అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టడంలేదన్నారు.

రెండవ ఎస్సార్సీలో తెలంగాణ అంశం చేరుస్తారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత గోనె ప్రకాశరావు చెప్పారు. కేవలం ఉత్తర ప్రదేశ్ కోసమే ఎస్సార్సీ వేయరని ఆయన అన్నారు. రెండవ ఎస్సార్సీ వేయాలని గతంలోనే ఏఐసిసి అప్పటి ఎన్డీఏ ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు. ఇప్పుడు కూడా రెండవ ఎస్సార్సీని వేసి అందులో తెలంగాణ అంశాన్ని చేరుస్తారని ఆయన వివరించారు. కాంగ్రెస్ నేతలు అందరూ రాజీనామా చేస్తే తెలంగాణ అదే వస్తుందని ఆయన అన్నారు. తెలంగాణ విషయంలో ఇంకా కాలయాపనచేయడం భావ్యంకాదన్నారు.

English summary
Political parties are opposing the 2nd SRC proposal on Telangana. CPM secretary BV Raghavulu said that 2nd SRC is not acceptable.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X