వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరింత కాలం కనిమొళికి జైలే, సిబిఐకి హైకోర్టు నోటీసు

By Pratap
|
Google Oneindia TeluguNews

Kanimozhi
న్యూఢిల్లీ: మరింత కాలం డిఎంకె పార్లమెంటు సభ్యురాలు కనిమొళి జైల్లోనే ఉండాల్సి వస్తోంది. ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణను ఢిల్లీ హైకోర్టు మంగళవారం ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. కనిమొళితో పాటు కలైంగర్ టీవీ చీఫ్ శరద్ కుమార్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌పై విచారణను కూడా కోర్టు వాయిదా వేసింది. 2జి స్పెక్ట్రమ్ కేసులో వారిద్దరు కూడా ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు.

కనిమొళి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు సిబిఐకి నోటీసు జారీ చేసింది. కనిమొళి, శరద్ కుమార్ బెయిల్ పిటిషన్‌ను సిబిఐ ప్రత్యేక కోర్టు తిరస్కరించి వారిద్దరిని వెంటనే అరెస్టు చేయాలని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. సిబిఐ మోపిన అభియోగాల్లో నిజం లేదని కనిమొళి తరఫు న్యాయవాది వాదించారు. తాను పిల్లల తల్లినని, వారి బాగోగులు చూడాల్సిన అవసరం ఉందని, అందువల్ల తనకు బెయిల్ మంజూరు చేయాలని కనిమొళి తన బెయిల్ పిటిషన్‌లో చెప్పుకున్నారు.

English summary
Here comes a bad piece of news for DMK MP Kanimozhi who will now have to stay behind the bars for some more time at least, as the Delhi High Court on Tuesday put off the hearing on her bail plea to May 30.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X