హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మంత్రులకు ముఖ్యమంత్రి క్లాస్, సమాధానం ఇవ్వని మంత్రులు

By Pratap
|
Google Oneindia TeluguNews

Kiran kumar Reddy
హైదరాబాద్: మంత్రులకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి క్లాస్ తీసుకున్నారు. మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆయన మంత్రులకు దిశానిర్దేశం చేసేందుకు ప్రయత్నించారు. మన మధ్య విభేదాలున్నాయనే ప్రచారం జరుగుతోందని, అటువంటి ప్రచారం జరగకుండా చూడాలని ఆయన మంత్రులకు సూచించారు. వివాదాలు మాని కలిసి పనిచేద్దామని ఆయన సూచించారు. కలిసికట్టుగా పనిచేసి పార్టీ ప్రతిష్టను పెంచుదామని ఆయన అన్నారు. అయితే, ముఖ్యమంత్రి సూచనలకు మంత్రుల నుంచి ఏ విధమైన స్పందన కూడా లభించలేదు.

అయితే, మంత్రులు సమస్యలను మంత్రి వర్గ సమావేశంలో ప్రస్తావనకు తెచ్చారు. ఖరీఫ్ సీజన్‌కు ముందే సిద్ధం కావాలని బొత్స సత్యనారాయణ సూచించారు. గోనె సంచుల కొరతపై మంత్రి వట్టి వసంతకుమార్ ప్రస్తావించారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకుని ముఖ్యమంత్రి మంత్రులకు సూచించారు. ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టుకు త్వరలో జాతీయ హోదా లభిస్తుందని కూడా ఆయన చెప్పారు. వైద్య, ఆరోగ్య శాఖను పునర్వ్యస్థీకరించాం గానీ వైద్యులు లేరని మంత్రులు చెప్పారు. అలాగే, రేబిస్ వ్యాక్సిన్ కొరతపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగింది.

సచివాలయంలో ఈ రోజు భేటీ అయిన మంత్రి వర్గం పలు నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులకు 5.136శాతం కరవు భత్యం పెంచడానికి మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో 66 పోస్టుల భర్తీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వసతి భత్యాన్ని రూ.3వేల నుంచి రూ.10వేలకు పెంచేందుకు నిర్ణయించింది.

నల్గొండ ప్రభుత్వాసుపత్రిని 250పడకల నుంచి 400పడకల స్థాయికి పెంచనున్నారు. శ్రీకాకుళం జిల్లా రాజాం ప్రభుత్వాసుపత్రిని 50పడకల నుంచి 100పడకల ఆసుపత్రిగా విస్తరించనున్నారు. ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో 66 పోస్టులను భర్తీ చేయనున్నారు.సచివాలయంలో ఈరోజు సమావేశమైన మంత్రివర్గం ఈమేరకు నిర్ణ యాలు తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల గురించి భేటీలో ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది.

English summary
CM Kiran Kumar Reddy suggests ministers to work unitedly. He expressed concern about differences in among ministers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X