వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజీవ్ గాంధీ హత్యకు క్షమాపణ చెప్పిన ఎల్‌టిటిఇ నేత పద్మనాభన్

By Pratap
|
Google Oneindia TeluguNews

Kumaran Pathmanathan
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని హత్య చేసినందుకు శ్రీలంక ఎల్‌టిటిఇ నేత కుమారన్ పద్మనాభన్ భారత ప్రజలకు క్షమాపణలు చెప్పారు. రాజీవ్ గాంధీని హత్య చేయడం ప్రభాకరన్ తప్పిదమని ఆయన అన్నారు. రాజీవ్ గాంధీ హత్యకు పక్కా ప్రణాళికను రచించి, ప్రభాకరన్, ఎల్‌టిటిఇ ఇంటలిజెన్స్ చీఫ్ పొట్టు అమ్మన్ అమలు చేశారని, ఈ వాస్తవం అందరికీ తెలుసునని ఆయన అన్నారు.

సిఎన్ఎన్ - ఐబియన్ ఫస్ట్ పోస్ట్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. పద్మనాభన్ ఎల్‌టిటిఇ కోశాధికారిగా, ఆయుధ సేకరణ బాధ్యుడిగా వ్యవహరించారు. ప్రభాకరన్ తప్పిదానికి భారత ప్రజలకు, ప్రత్యేకంగా గాంధీ కుటుంబ సభ్యులకు తాను క్షమాపణ చెప్పదలుచుకున్నట్లు ఆయన తెలిపారు. "దయచేసి మమ్మల్ని క్షమించండి. నేను వేడుకుంటున్నాను. దానికి నా విచారం. రాజీవ్ గాంధీ కుమారుడి (రాహుల్ గాంధీ) మనోభావాలు నాకు తెలుసు. రాజీవ్ గాంధీతో కూతురు, కుమారులకు ఎంత అనుబంధం ఉండేదో నాకు తెలుసు" అని ఆయన అన్నారు.

శ్రీలంకలోని తమిళులు మానవులుగా జీవించే వెసులుబాటు కోరుకుంటున్నారని, ఇప్పటికే తాము ఎంతో మూల్యం చెల్లించామని, మరింతగా నష్టపోవడానికి తాము సిద్ధంగా లేమని ఆయన అన్నారు.

English summary
A top LTTE leader Kumaran Pathmanathan has apologised to India for V Prabhakaran's "mistake" of killing former Prime Minister Rajiv Gandhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X