హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భాను కిరణ్ కోసం గాలిస్తున్నాం: హైదరాబాదు సిపి ఎకె ఖాన్

By Pratap
|
Google Oneindia TeluguNews

AK Khan
హైదరాబాద్‌: మద్దెలచెర్వు సూరి హత్య కేసులో నిందితుడు భానుకిరణ్ కోసం గాలిస్తున్నామని హైదరాబాద్ పోలీసు కమిషనర్ ఎకె ఖాన్ చెప్పారు. భాను కిరణ్ వ్యవహారాన్ని తాము వదిలిపెట్టలేదని, తగిన చర్యలు తీసుకుంటూనే ఉన్నామని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. మజ్లీస్ శాససనభ్యుడు అక్బరుద్దీన్‌పై దాడి జరిగినప్పుడు ఆయన చేతిలోనూ ఆయుధం ఉందని, అయితే అక్బరుద్దీన్‌ ఆయుధాన్ని వాడారా లేదా అనే విషయం నివేదికలో తెలుస్తుందని ఆయన అన్నారు.

హైదరాబాద్‌లో 6,167 ఆయుధాలుండగా 4,890 ఆయుధాలకు లైసెన్సులు ఉన్నాయని ఖాన్‌ చెప్పారు. 2,591 ఆయుధాల లైసెన్సులను పరిశీలించామని,472 ఆయుధ లైసెన్సులపై అనుమానాలు ఉన్నట్లు తెలియజేశారు. నగరంలో 1060 రౌడీషీటర్లు ఉన్నారని, కొత్తగా 680 రౌడీషీట్లను తెరిచేందుకు ప్రతిపాదనలు వచ్చాయని తెలియజేశారు. ఆరుగురు రౌడీషీటర్లను హైదరాబాద్‌ నుంచి బహిష్కరించామని, మరో 12 మందిని హైదరాబాద్‌ నుంచి బహిష్కరించే అవకాశం ఉందని వెల్లడించారు.

English summary
Hyderabad police Commissioner AK Khan said that police are searching for Bhanukiran, culprit in Maddelachervu Suri murder case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X