హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నాగం జనార్దన్ రెడ్డితో వైయస్సార్ కాంగ్రెసు నేత గోనె ప్రకాశ రావు

By Pratap
|
Google Oneindia TeluguNews

Gone Prakash Rao
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ అయిన శానససభ్యుడు నాగం జనార్దన్ రెడ్డిని వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు గోనె ప్రకాశ రావు కలిశారు. తాను వ్యక్తిగతంగానే నాగం జనార్దన్ రెడ్డి కలిసినట్లు భేటీ అనంతరం గోనె ప్రకాశ రావు మీడియా ప్రతినిధులతో చెప్పారు. నాగం జనార్దన్ రెడ్డి, తాను పాత మిత్రులమని ఆయన చెప్పారు. రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఇవ్వడానికి వీలుందని ఆయన చెప్పారు.

వ్యక్తిగతంగా తాను నాగం జనార్దన్ రెడ్డి తెలంగాణ ఉద్యమానికి సహకరిస్తానని ఆయన చెప్పారు. నాగం జనార్దన్ రెడ్డి ఉప ప్రాంతీయ పార్టీ పెట్టవచ్చునని ఆయన అన్నారు. తెలంగాణపై జులై 8వ తేదీన జరిగే ప్లీనరీ సమావేశంలో చర్చిస్తామని ఆయన చెప్పారు.

English summary
YSR Congress party leader Gone Prakash Rao met suspended TDP MLA Nagam janardhan Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X