వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆండ్రాయిడ్‌ మొబైల్‌ వాడుతున్నారా? మరి, సెక్యూరిటీ సంగతేంటి?

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

Android Security
గూగుల్‌ గూటి నుంచి వచ్చిన ఆండ్రాయిడ్‌ మొబైల్‌ గుండె చప్పుడులా మారిపోయింది. పేరొందిన మొబైల్‌ ఆపరేటింగ్‌ సిస్టంలను వెనక్కి నెట్టేసి మొదటిస్థానంలో కొనసాగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది కొనుగోలు చేస్తున్న మొబైల్‌ ఫ్లాట్‌ఫాంగా రికార్డ్‌లు సృషిస్తోంది. కమ్యూనిటీ డెవలపర్స్‌తో 'ఆండ్రాయిడ్‌ మార్కెట్‌ స్టోర్‌'లో సుమారు 2,00,000 అప్లికేషన్స్‌ని అందుబాటులో ఉంచారు. దీంతో మినీ ల్యాప్‌టాప్‌గా మారిన మొబైల్‌పై హ్యాకర్లు వైరస్‌లతో దాడులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆండ్రాయిడ్‌ మొబైల్స్‌కి అంగరక్షకుల్ని ఏర్పాటు చేసుకోవడం ఎంతైనా అవసరం.

మొబైల్‌ను స్కాన్‌ చేసి వైరస్‌ జాడల్ని వెతికి పట్టేయాలంటే AntiVirusFreeను నిక్షిప్తం చేయండి. షెడ్యూల్‌ స్కానింగ్‌ పెట్టుకోవచ్చు. అంటే నిర్ణీత సమయానికి ఆటోమాటిక్‌గా స్కానింగ్‌ అయ్యేలా చేయవచ్చు. సాఫ్ట్‌వేర్‌లను డౌన్‌లోడ్‌ చేసే ముందు స్కాన్‌ చేయవచ్చు. వెబ్‌సైట్‌లు, ఈమెయిళ్లు, ఎసెమ్మెస్‌ల నుంచి డౌన్‌లోడ్‌ చేసే డేటాని కూడా స్కాన్‌ చేస్తుంది. మొబైల్‌ను పొగొట్టుకుంటే జీపీఎస్‌ సదుపాయంతో ఎక్కడుందో కనిపెట్టవచ్చు. మొబైల్‌కు తాళం వేసి డేటా మొత్తాన్ని చెరిపేసే వీలుంది. మొబైల్‌ను రక్షించే రక్షక భటుడిని పెట్టుకోవాలంటే LookOutను ఇన్‌స్టాల్‌ చేసుకోండి. సెక్యూరిటీ, బ్యాక్‌అప్‌ సౌకర్యాలతో రూపొందించారు. డేటాని హ్యాకర్ల చేతిలో పడుకుండా చూస్తుంది. Privacy Advisor ద్వారా లాగిన్‌ వివరాల్ని మానిటర్‌ చేస్తుంది. పొగొట్టుకున్న సందర్భాల్లో ఫోన్‌ పని చేయకుండా చేయడంతో పాటు, సమాచారాన్ని డిలీట్‌ చేయవచ్చు. ఫోన్‌నెంబర్లు, ఇతర సమాచారాన్ని బ్యాక్‌అప్‌ చేసుకోవచ్చు. డిలీట్‌ చేసిన డేటాని తిరిగి పొందే వీలుంది. సైలెంట్‌ మోడ్‌లో పెట్టినప్పటికీ అలారం ద్వారా ఎక్కడుందో కనిపెట్టవచ్చు.

ప్రముఖ సెక్యూరిటీ సంస్ధ Norton ఉచితంగా అందిస్తున్న బీటా వెర్షనే Norton Smartphone Security. మొబైల్‌ను పొగట్టుకున్న సందర్భాల్లో ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఎవరైనా సిమ్‌కార్డ్‌ని మార్చడానికి ప్రయత్నిస్తే మొబైల్‌ 'లాక్‌' అవుతుంది. ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ని నిక్షిప్తం చేసుకుంటుంది. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్‌కాల్స్‌, టెక్ట్స్‌ మెసేజ్‌లను బ్లాక్‌ చేసే వీలుంది.

వ్యక్తిగత సమాచారాన్ని ఇతరులు చూడకుండా చేయాలంటే Android Protector ఉండాల్సిందే. ప్రత్యేక పిన్‌కోడ్‌ ద్వారా ముఖ్యమైనా సర్వీసుల్లోని డేటా (ఎసెమ్మెస్‌లు, జీమెయిల్‌, ఫోన్‌నెంబర్లు...) ఇతరుల కంటపడకుండా చేయవచ్చు. ఎన్నో వెబ్‌ సర్వీసుల్లో లాగిన్‌ అవుతుంటాం. వాటి యూజర్‌నేమ్‌, పాస్‌వర్డ్‌లను గుర్తుపెట్టుకోవడం కష్టమే. మొబైల్‌ బ్రౌజింగ్‌లో లాగిన్‌ వివరాల్ని సురక్షితంగా మేనేజ్‌ చేసుకోవడానికి KeePassdroid ఉంది. అన్ని లాగిన్‌ వివరాల్ని డేటాబేస్‌ రూపంలో నిక్షిప్తం చేసి, మొత్తం డేటాబేస్‌కి 'మాస్టర్‌ కీ'ని ఏర్పాటు చేసుకోవచ్చు. మాస్టర్‌ పాస్‌వర్డ్‌ని గుర్తుంచుకుంటే అన్నింటినీ గుర్తుంచుకున్నట్టే! ఓపెన్‌సోర్స్‌ కమ్యూనిటీ దీని రూపకర్త.

* మొబైల్‌ని పాస్‌వర్డ్‌తో లాక్‌ చేయడం మర్చిపోవద్దు. ఇతరులు వాడకుండా Android Settings-> Location & Securityలోకి వెళ్లి 'స్క్రీన్‌లాక్‌'ను ఎనేబుల్‌ చేయాలి. పాస్‌వర్డ్‌ ఆప్షన్స్‌లో నచ్చిన విధానాన్ని ఎంచుకోవచ్చు. ఉదాహరణకు అంకెల్ని, వేలి ముద్రల్ని (Fingerprints Lock) పాస్‌వర్డ్‌లా పెట్టుకోవచ్చన్నమాట.
* ఎక్కడైనా మొబైల్‌ను మర్చిపోతే హోం స్క్రీన్‌పై మీ అడ్రస్‌, ఫోన్‌ నెంబర్‌ వివరాల్ని కనిపించేలా చేయవచ్చు. అందుకు ఆండ్రాయిడ్‌ మార్కెట్‌లో స్టోర్‌లో థర్ట్‌పార్టీ అప్లికేషన్లు ఉన్నాయి. వాటిల్లో Phone Found Owner info app ఒకటి. ఉచితంగా నిక్షిప్తం చేసుకోవచ్చు. సెట్టింగ్స్‌లోకి వెళ్లి అదే మెసేజ్‌ని 'స్క్రీన్‌లాక్‌'లో పెట్టుకోవచ్చు.
* మాల్వేర్ల బెడదలేని అధికారిక సైట్‌ల నుంచి మాత్రమే అప్లికేషన్లను డౌన్‌లోడ్‌ చేయండి.
* వాడని 'వైర్‌లెస్‌ కనెక్టివిటీ' సర్వీసుల్ని డిసేబుల్‌ స్థితిలోనే ఉంచడం సురక్షితం. ఉదాహరణకు వై-ఫై సర్వీసుని వాడకుంటే ఇంటి నుంచి బయటకి రాగానే డిసేబుల్‌ చేయాలి. Wi-Fi Auto Connect ఆప్షన్‌ను తప్పక డిసేబుల్‌ చేయండి.

English summary
Has Google constructed its business model in such a way as to provide handset manufacturers with an incentive to begin putting NFC Android phones into large scale production at last. If so, how and at what cost? And how will Google gain control over a secure element built into a phone by a handset maker it doesn't own?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X