వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబుతో వైయస్ జగన్ కుమ్మక్కయ్యారు: డిఎల్ రవీంద్రా రెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

DL Ravindra Reddy
కడప: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడితో కుమ్మక్కయి ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నిస్తున్నారని మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి విమర్శించారు. తమ ప్రభుత్వాన్ని 2014 వరకు కూల్చలేరని ఆయన అన్నారు. అవినీతిలో చంద్రబాబు, జగన్ తోడు దొంగలని ఆయన ఆరోపించారు. ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం పెడితే తాము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు. కావాలంటే అవిశ్వాస తీర్మానం పెట్టి చూడాలని ఆయన సవాల్ విసిరారు. తన దయతోనే ప్రభుత్వం మనుగడ సాగిస్తోందని అనడం జగన్ కండకావరానికి నిదర్శనమని ఆయన అన్నారు.

వైయస్ రాజశేఖర రెడ్డి మరణించినప్పుడు వైయస్ జగన్‌కు 150 మంది శాసనసభ్యుల మద్దతు ఉందని, అది ఇప్పుడు 30కి పడిపోయిందని, అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తే అది మూడుకో సున్నాకో పడిపోతుందని ఆయన అన్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఊసే లేదని ఆయన అన్నారు. ఉప ఎన్నికల్లో మూడో స్థానానికి పడిపోయిన తెలుగుదేశం పార్టీకి ఎన్ని మహానాడులు నిర్వహించుకున్నా ఫలితం ఉండదని ఆయన అన్నారు.

అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించి ప్రభుత్వాన్ని పడగొట్టలేరని కాంగ్రెసు శాసనసభ్యుడు వీరశివా రెడ్డి అన్నారు. దమ్ముంటే అవిశ్వాసం ప్రతిపాదించాలని ఆయన జగన్‌ను సవాల్ చేశారు. గవర్నర్ వద్దకు వెళ్లి జగన్ లేఖ ఇవ్వాలని ఆయన అన్నారు. 2014 వరకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి డోకా లేదని ఆయన దీమా వ్యక్తం చేశారు.

English summary
Minister DL Ravindra Reddy accused that YSR Congress party president YS Jagan has colluded with TDP president N Chandrababu Naidu to topple Government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X