వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సినీ యుగ్ ఫిల్మ్ డైరెక్టర్ కరీం మొరానీకి బెయిల్ నిరాకరణ

By Pratap
|
Google Oneindia TeluguNews

Karim Morani
న్యూఢిల్లీ: 2జి స్పెక్ట్రమ్ స్కామ్ కేసులో సినీ యుగ్ ఫిల్మ్ డైరెక్టర్ కరీం మొరానీకి సిబిఐ ప్రత్యేక కోర్టు సోమవారం బెయిల్ నిరాకరించింది. వైద్య కారణాల వల్ల తనకు బెయిల్ ఇవ్వాలని కరీం మొరానీ కోర్టును కోరారు. అయితే, మొరానీ బెయిల్‌ పిటిషన్‌ను సిబిఐ ప్రత్యేక న్యాయవాది ఒపి సైనీ నిరాకరిస్తూ అతన్ని 14 రోజుల పాటు జ్యుడిష్యల్ కస్టడీ విధించారు. దీంతో కరీం మొరానీని తీహార్ జైలుకు తరలించారు.

మొరానీ ఆరోగ్య పరిస్థితి నిలకడగా, సాధారణంగా ఉందని ముంబై జెజె ఆస్పత్రి కార్జియోలజీ, న్యూరో సర్జరీ శాఖ నివేదిక ఇచ్చింది. మొరానీ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరిస్తూ తమ ముందు హాజరు కావాలని మే 24వ తేదీన కోర్టు ఆదేశించింది. బెయిల్ నిరాకరణను హైకోర్టులో సవాల్ చేస్తామని కరీం మొరానీ సోదరుడు మొహమ్మద్ మొరానీ చెప్పారు. డిఎంకె పార్లమెంటు సభ్యురాలు కనిమొళికి 20 శాతం వాటా ఉన్న కలైంగర్ టీవీ చానెల్‌కు 200 కోట్ల రూపాయలను డిబి రియాల్టీ నుంచి బదలాయించడంలో కరీం మొరానీ సహకరించాడని సిబిఐ ఆరోపించింది. అందుకు గాను అతను ఆరు కోట్ల రూపాయలు తీసుకున్నట్లు కూడా ఆరోపించింది.

English summary
2G scam: No bail for Karim Morani, sent to Tihar Jail
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X