వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కనిమొళికి లభించని బెయిల్, నిర్ణయాన్ని వాయిదా వేసిన కోర్టు

By Pratap
|
Google Oneindia TeluguNews

Kanimozhi
న్యూఢిల్లీ: 2జి స్పెక్ట్రమ్ స్కామ్ కేసులో డిఎంకె పార్లమెంటు సభ్యురాలు కనిమొళికి సోమవారం బెయిల్ లభించలేదు. కనిమొళి పెట్టుకున్న బెయల్ పిటిషన్‌పై నిర్ణయాన్ని ఢిల్లీ హైకోర్టు రిజర్వులో పెట్టింది. సిబిఐ ప్రత్యేక కోర్టు బెయిల్ తిరస్కరించడంతో ఆమెను మే 20వ తేదీన అరెస్టు చేసి తీహార్ జైలుకు పంపించారు. సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలున్నాయనే ఉద్దేశంతో సిబిఐ కోర్టు కనిమొళికి బెయిల్ నిరాకరించింది.

2జి స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో కనిమొళిని సిబిఐ సహ కుట్రదారుగా పేర్కొంటూ చార్జీషిట్ దాఖలు చేసింది. టెలికం మాజీ మంత్రి ఎ రాజాతో కుమ్మక్కయి కనిమొళి కలైంగర్ టీవి చానెల్ కోసం 214 కోట్ల రూపాయల లంచం తీసుకున్నారని సిబిఐ ఆరోపించింది. సిబిఐ కోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కనిమొళి ఢిల్లీ హైకోర్టులో బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్నారు.

English summary
The Delhi high court on Monday reserved its order on bail plea of DMK MP Kanimozhi. Kanimozhi is an accused in the 2G scam case.. In her petition, Kanimozhi had earlier, challenged the CBI court's order calling for her to be sent to custody.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X