హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబు చిన్న మెదడు చితికింది, జగన్‌ను తిట్టడమే పని: రోజా

By Pratap
|
Google Oneindia TeluguNews

Roja
హైదరాబాద్: తెలుగుదేశం మహానాడు ఆత్మస్తుతి, పరనిందగా సాగిందని, కడప ఎంపీ వైయస్ జగన్మోహనరెడ్డిని తిట్టడమే పనిగా పెట్టుకున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి రోజా విమర్శించారు. జగన్‌ను ఎదుర్కోలేమనే సంకేతాలను మహానాడు వేదిక ద్వారా స్పష్టంగా ఇచ్చారని, భావినేత జగనే అని చాటారని ఆమె అన్నారు.

కడప ఎన్నికల తర్వాత దిమ్మతిరిగి బాబుకు చిన్న మెదడు చితికిందని, రాజకీయాలను రాజకీయంగా చేస్తే బాగుంటుందని, దిగజారడం తగదని పేర్కొన్నారు. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్‌ను దెబ్బతీశామని ఎందుకు అంగీకరించలేదని ఆమె ప్రశ్నించారు. ఎన్టీఆర్ కుటుంబాన్ని అవమానించారని, హరికృష్ణను వేదిక మీద నుంచి దిగే పరిస్థితి కల్పించారని రోజా ఆరోపించారు. జగన్‌ను తిట్టడం మాని ప్రజలకు ఏం చేయబోతున్నారో చెబితే టీడీపీకి లాభమని ఆమె సలహా ఇచ్చారు.

English summary
YSR Congress party leader Roja lashed out at TDP president N Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X