వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అన్నా హజారేకు రామ్‌దేవ్ షాక్, లోక్‌పాల్ బిల్లుపై భిన్నాభిప్రాయం

By Pratap
|
Google Oneindia TeluguNews

Baba Ramdev
న్యూఢిల్లీ: లోక్‌పాల్ బిల్లు పరిధిలోకి ప్రధానిని, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తేవాలని డిమాండ్ చేస్తున్న సామాజిక కార్యకర్త అన్నా హజారేకు యోగా గురు రామ్ దేవ్ బాబా షాక్ ఇచ్చారు. ఈ విషయంలో అన్నా హజారేతో ఆయన విభేదించారు. అవినీతిపై నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించిన రామ్ దేవ్ బాబాను బుజ్జగించడానికి కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించినట్లే కనిపిస్తోంది. ప్రధానిని, ప్రధాన న్యాయమూర్తిని లోక్‌పాల్ బిల్లు పరిధిలోకి ఎలా తెస్తారని ఆయన అడిగారు.

వివాదాస్పద సమస్య జోలికి తాను వెళ్లదలుచుకోలేదని, అయితే దానిపై బహిరంగ చర్చ జరగాలని ఆయన అన్నారు. అన్నా హజారే దీక్షకు రామ్ దేవ్ బాబా మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, జూన్ 4వ తేదీ నుంచి తాను తలపెట్టిన దీక్షను విరమించుకోవడానికి రామ్ దేవ్ బాబా నిరాకరించారు. రామ్ దేవ్ బాబాను ఒప్పించడానికి తాము ప్రయత్నం చేస్తామని లోక్‌పాల్ బిల్లు ముసాయిదా తయారీ సంయుక్త కమిటీ సభ్యుడు అరవింద్ కేజ్రివాల్ అన్నారు.

English summary
Differences appeared to have cropped up in the civil society over the demand for inclusion of the Prime Minister and higher judiciary in the Lokpal Bill with Baba Ramdev opposing such a move.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X