అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నిర్ణయం తీసుకోలేదు: సత్యసాయి ట్రస్టు, హాజరు కాని జస్టిస్ భగవతి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sathya Sai Baba
అనంతపురం: గత రెండు రోజులుగా యజుర్వేద మందిరాన్ని తెరుస్తారనే కథనాలు వెలువడిన నేపథ్యంలో మంగళవారం సత్యసాయి సెంట్రల్ ట్రస్టు అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడంతో ఆ మందిరాన్ని ఎప్పుడు తెరుస్తారో నిర్ణయం తీసుకోవాడానికే సభ్యులు భేటీ అయ్యారని భావించారు. అయితే భేటీ అనంతరం సాయి ట్రస్టు సభ్యులు మీడియాతో మాట్లాడారు. తాము యజర్వేద మందిరం తెరవడంపై భేటీలో చర్చించలేదని చెప్పారు. కోట్లాది భక్తుల ఆరాధ్య దైవం అయిన సత్యసాయిబాబా మహాసమాధి నిర్మాణంపై చర్చించినట్లు వారు స్పష్టం చేశారు. సమాధి నిర్మాణంతో పాటు సిబ్బంది వేతనంపై కూడా చర్చించినట్లు చెప్పారు.

భేటీ అనంతరం సభ్యులు మందిరంపై చర్చించలేదని చెప్పడంతో మళ్లీ దానిపై ఉత్కంఠ ఏర్పడింది. సత్యసాయి ట్రస్టుకు సంబంధించి లక్షల కోట్ల రూపాయలు అందులోనే ఉన్నట్లు కథనాలు వినిపిస్తున్నాయి. కాగా ఈ సమావేశానికి జస్టిస్ భగవతి, హిందూలాల్ షా హాజరు కాలేదు. దీంతో మరోసారి సభ్యులు భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. కాగా రత్నాకర్ సాయంత్రం మీడియా ప్రతినిధులతో మాట్లాడనున్నట్టు తెలుస్తోంది. అయితే ప్రత్యేకంగా మీడియాతో మాట్లాడకుండా కలిసిన వారితో మాత్రమే మాట్లాడే అవకాశం ఉంది.

English summary
Sathya Sai trust board did not take decision on Yajurveda Mandiram open. They said after meeting that they were not met on that issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X